జాతీయంహోమ్

ఢిల్లీలో భారీగా ఆయుధాలు స్వాధీనం

#GunCulture

ఎర్రకోట లో పేలుళ్ల తర్వాత మరో ఘటన ఢిల్లీలో జరిగింది. దాడికి సంబంధించిన వారి నివాసాలపై జరిగిన దాడుల్లో భారీగా అమ్మోనియం నైట్రేట్‌తో పాటు అధునాతన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి. ఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఈ రాకెట్ బట్టబయలైంది.రోహిణి ప్రాంతంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ముఖ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్ నుంచి డ్రోన్ల సహాయంతో ఈ ఆయుధాలు భారతదేశానికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. పంజాబ్‌లోని పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ గుంపులకు ఈ ఆయుధాలు అందాల్సి ఉన్నట్లు విచారణలో బయటపడింది. టర్కీ, చైనాలో తయారైన ఈ అధునాతన తుపాకులు, పంజాబ్ మార్గంగా ఢిల్లీకి చేరినట్లు తెలిపారు.వీటిని లౌరేష్ బిష్ణోయ్, బాంబిహా, గోగి, హిమాన్షు భావు గ్యాంగ్‌లకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే పోలీసులు రోహిణిలో వల వేసి పట్టుకున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టైన నిందితులను గట్టిగా విచారిస్తున్నారు. ఆయుధాల సరఫరా వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను బయటకు తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పట్టుబడిన నలుగురు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారని అధికారులు ధ్రువీకరించారు.

Related posts

కల్వకుంట్ల కవితకు డిపాజిట్లు కూడా రావు

Satyam News

కేంద్రం చేతిలో కీలుబొమ్మ ఈ గవర్నర్

Satyam News

లక్షలాది రూపాయల దుర్వినియోగంపై సీఎంకు ఫిర్యాదు

Satyam News

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు:ఉలిక్కిపడ్డ దేశం!

Satyam News

గాజా పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

Satyam News

క్వాంటం కంప్యూటింగ్ లో కీలక ఘట్టం ఆవిష్కరించిన అమరావతి

Satyam News

Leave a Comment