24.5 C
Hyderabad
September 23, 2026
రంగారెడ్డిహోమ్

బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం

#BasavarajuSrinivas

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యకలాపాలు, పేద బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూడాలని చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పెండింగ్‌లో ఉన్న రూ.6 కోట్ల నిధులతో పాటు ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పొందిన రూ.25 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

బ్రాహ్మణ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఈ నిర్ణయం నిదర్శనమని ఈ సందర్భంగా బసవరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. పేద మరియు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల అభ్యున్నతి, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో పరిషత్ ద్వారా మరింత విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ నిధులు దోహదపడతాయని తెలిపారు.

“బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అవసరమైన నిధులను విడుదల చేయడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది తెలంగాణ బ్రాహ్మణ సమాజంపై ప్రభుత్వం చూపుతున్న గౌరవం, చిత్తశుద్ధికి నిదర్శనం” అని బసవరాజు శ్రీనివాస్ అన్నారు.

ఈ సందర్భంగా యావత్ తెలంగాణ బ్రాహ్మణ సమాజం తరపున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కి, బ్రాహ్మణులు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు కి బసవరాజు శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

“రాజకీయాలకు, ప్రాంతాలకు, శాఖా భేదాలకు అతీతంగా బ్రాహ్మణ సమాజం ఐక్యంగా ఉండి, ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు సాగితే మన సమాజ అభివృద్ధికి మరిన్ని అవకాశాలు సాధించుకోవచ్చు. బ్రాహ్మణుల సంక్షేమం, ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం అందరం ఐక్యంగా కృషి చేద్దాం” అని బసవరాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Related posts

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్థన్‌ రాజు

Satyam News

అమెరికా సుంకాల తగ్గింపు…ఎందుకో తెలుసా?

Satyam News

పేదలకు 6 లక్షల ఇళ్లు… బడ్జెట్‌లో భారీ కేటాయింపులు

Satyam News

ప్రతి నియోజకవర్గంలో మహిళ దినోత్సవ వేడుకలు

Satyam News

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

Satyam News

విశాఖ స్టీల్ ప్లాంట్‌ రికార్డ్‌… జనవరిలో భారీ లాభాలు

Satyam News

Leave a Comment