23.9 C
Hyderabad
September 27, 2026
ముఖ్యంశాలుహోమ్

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల తో ఎమ్మెల్యే అరవింద బాబు భేటీ

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మంగళవారం గుంటూరులో సమావేశమయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ప్రస్తుత స్థితిగతుల గురించి వివరంగా చర్చించారు.

రాబోయే రోజుల్లో నరసరావుపేట నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఎంపీని కోరారు. నరసరావుపేటలో బీసీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలం కేటాయించే విషయంలో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

అలాగే ఆటోనగర్ నిర్మాణ పనులకు ఉన్న అడ్డంకులను తొలగించి, త్వరితగతిన పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో నరసరావుపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందంజలో ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అరవింద బాబును అభినందించారు.

నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఇరువురు నాయకులు ఆకాంక్షించారు.

Related posts

గాజువాకలో ఈ నెల 29న మెగా జాబ్ మేళా

Satyam News

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

Satyam News

అమ్మా…. నాకు ఆ అబ్బాయి కావాలి!

Satyam News

కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!

Satyam News

నేను రావద్దు అన్న వారినే ముంబయి తరిమికొట్టింది

Satyam News

ప్రభుత్వ డాక్టర్లపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు

Satyam News

Leave a Comment