ప్రత్యేకంహోమ్

లోకేశ్‌ రెడ్‌ బుక్‌…. పవన్‌ యోగీ ట్రీట్‌మెంట్‌…. వైసీపీకి మూడింది..!

#Lokesh

సోషల్‌ మీడియాలో బూతులు.. లైవ్‌లో బెదిరింపులు.. అధికారం పోయినా వైసీపీ అధినేత నుంచి కార్యకర్తల వరకు.. వారి తీరు మారలేదు… బూతులు ఆగలేదు.. దౌర్జన్యాలు తగ్గలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. మెడికల్‌ కాలేజీలు తీసుకుంటే జైల్లో వేస్తా అని జగన్‌రెడ్డి బెదిరించడంతో.. ఇప్పటి వరకు కూల్‌గా ఉన్న కూటమి పెద్దలకు మంటెక్కిపోయింది. ఇంకా ఊరుకుంటే.. మరింత రెచ్చిపోతారనే క్లారిటీ వచ్చింది. ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే అరాచకాలకు తెగబడతారని అర్ధమైంది. అందుకే మంత్రి నారా లోకేశ్‌, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. వైసీపీకి అదిరిపోయే హెచ్చరికలు జారి చేశారు.

జగన్‌ హయాంలో చేసిన అవమానాలు, జరిగిన అక్రమాలు.. ఏవీ మర్చిపోలేదని.. అన్నీ గుర్తున్నాయని స్పష్టం చేశారు నారా లోకేశ్‌. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని.. జగన్‌ అండ్‌ కోకి డైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మళ్లీ వస్తారో రారో తెలియకుండానే.. అంతు చూస్తాం.. జైల్లో వేస్తామని వార్నింగ్ ఇస్తున్న జగన్‌రెడ్డికి.. టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందనే రియాల్టీని రియలైజ్‌ అవ్వాలని వార్నింగ్‌ ఇచ్చారు.

లోకేశ్‌ వైసీపీని హెచ్చరించిన మరుసటి రోజే.. జనసేనాని పవన్‌ కళ్యాన్‌ వైసీపీ గూండాలకు అదిరిపోయే వార్నింగ్‌ ఇచ్చారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే భయపడలేదని.. ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతల వెనుక రౌడీలు, గూండాలు ఉన్నారని అధికారులు భయపడుతున్నారని చెప్పారు. అలాంటి వారికి యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తే ఏమైపోతారో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కూటమి పెద్దలంతా కలిసి రాజకీయ నిర్ణయం తీసుకుంటే.. వైసీపీ గూండాలు, రౌడీలను రౌండప్‌ చేసి లోపల పడేయడం పెద్ద విషయం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని.. ఇంకా దిగజారితే కఠిన చర్యలు తప్పవని డేంజర్ సిగ్నల్స్‌ పంపిచారు పవన్‌ కళ్యాణ్‌.

Related posts

రంగా, వైఎస్.. వివేకానందరెడ్డి మరణాలతో లాభపడింది ఎవరు..??

Satyam News

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

Satyam News

క్షీణించిన ఆశా భోంస్లే ఆరోగ్యం: బ్రిచ్కాండి ఆసుపత్రిలో చికిత్స

Satyam News

తోపుడు బండ్ల వ్యాపారుల నుండి అక్రమ వసూళ్లు

Satyam News

స్పోర్ట్స్ పట్టుదలతో ఆడాలి

Satyam News

రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం

Satyam News

Leave a Comment