సంపాదకీయంహోమ్

రంగా, వైఎస్.. వివేకానందరెడ్డి మరణాలతో లాభపడింది ఎవరు..??

#JaganReddy

వైసీపీని గొడ్డలి పార్టీ అన్నారని తెగ ఇదైపోయిన జగన్‌.. తనను తాను మంచోడిగా ప్రొజెక్ట్‌ చేసుకొనే ప్రయత్నం చేశారు. కానీ ఆయన సెల్ఫ్‌ డబ్బా బెడిసి కొట్టింది. వైఎస్ ఫ్యామిలీ మంచితనం ఏంటో.. వాళ్ల ఎదుగుదల వెనుక ఎంత దారుణమైన రక్తచరిత్ర ఉందో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ చర్చించుకొనే పరిస్థితి వచ్చింది. విజయవాడలో కాపు నేత రంగా హత్య కేసుతో పాటు.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, వివేకానందరెడ్డిపై గొడ్డలి వేటు గురించి జగన్‌ చేసిన కామెంట్స్‌ ఆయనకే రివర్స్ అవుతున్నాయి.

రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నేత వంగవీటి మోహన రంగా హత్య తర్వాత.. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. రాయలసీమలో ఆయనకు అడ్డొచ్చిన వాళ్లంతా కత్తిపోట్లకు, గొడ్డలి వేట్లకు బలైపోయారు. తెలుగుదేశం నేత.. వైఎస్ మనుషులు 26 కత్తిపోట్లు పొడిచినా.. అదృష్టవశాత్తు బతికిన పేర్ల పార్ధసారధిరెడ్డి.. వైఎస్ ఫ్యామిలీ దురగతాలకు బలైపోయిన వారి చిట్టా మొత్తం బటయపెట్టారు.

అప్పటిలో చెప్పింది వేరు… ఇప్పుడు చెబుతున్నది వేరు

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంపైనా జగన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పట్లో సోనియాగాంధీని, రిలయన్స్ ముఖేశ్‌ అంబానీలను నిందించిన జగన్‌ ఇప్పుడు చంద్రబాబు మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వైఎస్సార్‌ మరణంతో ఎవరికైనా లాభం జరిగింది అంటే అది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే అని ఆయన పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటారు. వైఎస్ మరణంతో వచ్చిన సానుభూతిని వాడుకొని సొంత పార్టీ పెట్టుకొని జగన్‌ రాజకీయంగా ఎదిగి.. ఏకంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకొన్నారు.

ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై జగన్‌ అండ్‌ కో ఎన్ని డ్రామాలు ఆడారో తెలుగు ప్రజలందరూ చూశారు. గుండుపోటుతో చనిపోయారని సాక్షి మీడియాలో ప్రచారం చేసి.. తర్వాత గొడ్డలి పోటు అని తేలడంతో.. ఆ పాపాన్ని చంద్రబాబు మీదకు తోసేసి రాజకీయంగా ప్రయోజనం పొందారు. అధికారంలోకి వచ్చాక.. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త ఈ హత్య చేయించారని మరో తప్పుడు ఆరోపణ చేశారు.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మీద మరోసారి నింద వేస్తున్నారు. అబద్దాలు ఒకసారి చెబితే నమ్ముతారు.. నిప్పలాంటి నిజం బయటపడిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ అవే అబద్దాలు చెబితే నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరు. ఏపీ ప్రజలందరికీ ఈ విషయం అర్ధమవుతోంది. కానీ ఆధారాలు లేకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న జగన్‌కీ.. ఆయనకు ఇలాంటి స్ట్రిప్టులు ఇస్తున్న వ్యూహకర్తలకి మాత్రం పబ్లిక్‌ పల్స్ అందడం లేదని అర్ధమవుతోంది. అందుకే గొడ్డలి పార్టీతో జాగ్రత్త.. గొడ్డలి పార్టీ నెవర్‌ ఎగైన్‌ అంటున్నారు సీఎం చంద్రబాబు.

Related posts

టీడీపీలో నవశకం…. యువ దళపతిగా లోకేష్‌

Satyam News

విశాఖకు మరో ఘనత..మహిళలకు అత్యంత సురక్షిత నగరం

Satyam News

గోదావరి జిల్లా ప్రేమ ఆప్యాయతల విందు

Satyam News

బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

Satyam News

ఆటో డ్రైవర్లకు 16 కండిషన్లు

Satyam News

వైసీపీ ఆత్మాహుతి దళం: రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా?

Satyam News

Leave a Comment