25.2 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

మెగాస్టార్ కు తొలి పత్రిక ఇచ్చిన అల్లు శిరీష్

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుతూ, అల్లు శిరీష్ తన వివాహ ఆహ్వాన తొలి పత్రిక ను మెగాస్టార్ చిరంజీవి కి అందించారు.

తెలుగు సంప్రదాయం ప్రకారం, ఇంట్లో జరిగే శుభకార్యానికి సంబంధించిన మొదటి ఆహ్వాన పత్రికను కుటుంబంలోని పెద్దలకు అందించడం ఆనవాయితీ. ఆ ఆచారాన్ని పాటిస్తూ, అల్లు అరవింద్, నిర్మల దంపతులు తమ చిన్న కుమారుడు అల్లు శిరీష్‌తో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. శిరీష్ తన మావయ్య చిరంజీవి, అత్త సురేఖలకు పెళ్లి పత్రికను అందించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

అల్లు శిరీష్ పెసుకోబోయే అమ్మాయి పేరు నయనిక రెడ్డి. వీరిద్దరికీ గత ఏడాది (అక్టోబర్ 2025) నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం మార్చి 6, 2026న ఘనంగా జరగనుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సరిగ్గా 15 ఏళ్ల క్రితం (2011లో), అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహం కూడా ఇదే తేదీన (మార్చి 6) జరిగింది. ఇప్పుడు తమ్ముడు శిరీష్ కూడా అదే తేదీన ఓ ఇంటివాడు కాబోతున్నారు.

చిరంజీవి దంపతులకు శుభలేఖ ఇస్తున్న ఫోటోలను అల్లు శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “మా కుటుంబ పెద్దలైన చిరంజీవి, సురేఖమ్మ కి మొదటి ఆహ్వానం అందించడం సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ ఫోటోలో చిరంజీవి చేతికి స్లింగ్ (కట్టు) కనిపిస్తుండటంతో, ఆయనకు ఇటీవల చిన్న షోల్డర్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలుస్తోంది.

ఇటీవలే అల్లు వారి ఇంట్లో ‘పసుపు దంచే’ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుమార్తె సుస్మిత, కోడలు ఉపాసన, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తదితర మెగా-అల్లు కుటుంబ సభ్యులందరూ పాల్గొని సందడి చేశారు.

 

Related posts

కడియం శ్రీహరి వ్యవహారశైలిపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

Satyam News

‘సకల శాఖల సజ్జల’ పై ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి…

Satyam News

ఫ్యాక్షన్ నుంచి ఫైటర్ జెట్ల దాకా…మారిన సీమ ఇమేజ్!

Satyam News

సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు దళపతి

Satyam News

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా

Satyam News

యాదగిరిగుట్టలో వేదపాఠశాలకు శంకుస్థాపన

Satyam News

Leave a Comment