26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

శ్రీరామ నవమి నాడు అయోధ్యలో కనిపించిన అద్భుతం

#AyodhyaRamTilak

అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం జరుపుకుంటున్న మూడో శ్రీరామనవమి కావడంతో భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై ఏర్పడిన ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు.

పండుగను పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ మూడో అంతస్తులో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక ప్రత్యేక నిర్మాణాన్ని రూపొందించారు.

ఆలయ శిఖరంపై సూర్యకాంతిని గ్రహించే పరికరాన్ని అమర్చగా, అక్కడినుంచి కాంతి పైపుల ద్వారా లోపలికి చేరి తిలకం రూపంలో ప్రతిబింబిస్తుంది. ఈ ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను ఐఐఏ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సహకారంతో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు రూపొందించారు.

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజునే ఈ ‘సూర్య తిలకం’ కనిపించేలా అత్యంత కచ్చితత్వంతో ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గడియారంలోని ముల్లుల కదలికలను పోలిన గేర్ టీత్ మెకానిజాన్ని వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్ద ప్రత్యేకంగా అమర్చిన అద్దాన్ని ఈ వ్యవస్థ 365 రోజుల పాటు స్వల్పంగా కదులుతూ ఉంటుంది. తద్వారా వచ్చే శ్రీరామనవమి రోజున కిరణాలు సరిగ్గా బాలరాముడి నుదుటిపై పడేలా సెట్ అవుతుంది.

Related posts

నెట్టెంపాడు భూ సేకరణ 45 రోజుల్లోగా పూర్తవ్వాలి

Satyam News

పోలవరం లో డీ వాటరింగ్ ప్రారంభం

Satyam News

ప్ర‌జారోగ్యానికి స‌వాలుగా మారిన ఊబ‌కాయం

Satyam News

ఎన్ని విమర్శలు వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు

Satyam News

టారిఫ్ లను వ్యతిరేకించేవారు ఫూల్స్

Satyam News

కృష్ణా ,గోదావరి నదుల్లో భారీ వరద

Satyam News

Leave a Comment