సంపాదకీయంహోమ్

పార్లమెంటులో జగన్ పార్టీ డ్రామాలు

#Jagan

లోక్‌సభ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడింది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆ పార్టీ ఎంపీలు మరోసారి నిరూపించుకున్నారు. లోక్‌సభలో కీలక బిల్లుపై చర్చ జరుగుతుండగా, మద్దతు తెలపాల్సింది పోయి.. సభ నుంచి వాకౌట్ చేసి తమ బాధ్యత నుంచి తప్పించుకున్నారు.

చిత్రమేమిటంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ, ప్రస్తుతం కేవలం బెయిలు మీద ఉన్న మిధున్ రెడ్డిని అడ్డం పెట్టుకుని వైకాపా అబద్ధాల రాజకీయం నడిపించే ప్రయత్నం చేసింది. సభలో వాస్తవాలను పక్కనపెట్టి, పచ్చి అబద్ధాలతో సభ్యులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన మిధున్ రెడ్డి, ఆ తర్వాత తన సహచర ఎంపీలతో కలిసి బయటకు నడిచారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడి సభాపతితో చివాట్లు తినడం గమనార్హం.

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి గురించి పార్లమెంటులో చర్చ మొదలవ్వగానే వైకాపా ఎంపీలలో వణుకు మొదలైంది. అమరావతి అభివృద్ధిపై జరుగుతున్న సానుకూల చర్చను తట్టుకోలేక, దాన్ని అడ్డుకునే ధైర్యం లేక చివరకు తోకముడిచి సభ నుంచి బయటకు వచ్చేయడం గమనార్హం.

“రాష్ట్ర రాజధానిపై చర్చ జరుగుతుంటే పారిపోవడం అంటే.. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే!” అని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

Related posts

విజయవాడ లో 10 వేల సీసీ కెమెరాలు

Satyam News

ఫోన్‌ నెంబర్‌ పై జగన్ మోసం..షాకిచ్చే యోచనలో CBI..??

Satyam News

మంత్రి పొంగులేటి తో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భేటీ

Satyam News

ఉయ్యూరులో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

Satyam News

రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం

Satyam News

కలెక్టర్ హిమాన్షు చర్యలతో మత్స్యకారుల్లో విశ్వాసం

Satyam News

Leave a Comment