అనంతపురంహోమ్

అనంతపురం యాపిల్స్‌.. . షిమ్లాకి పోటీగా సీమ రేగిపండ్లు

#AnanthapurApple

యాపిల్‌ని తెలుగులో సీమ రేగిపండ్లు అంటారు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ సీమ రేగిపండ్లు ఇప్పుడు మన రాయలసీమలో పండుతున్నాయి. యాపిల్ పండ్లు కాయాలంటే.. మైనస్‌ డిగ్రీల చలి వాతావరణం ఉండాలి కదా.. ఎండలు మండిపోయే రాయలసీమలో యాపిల్స్‌ పండించడం ఎలా అంటే.. ఇజ్రాయెలీ టెక్నాలజీతో అసాధ్యం అనుకున్నది సాధ్యమయింది.

ఇజ్రాయెల్‌లో కేఎల్‌డీ అనే రకం యాపిల్‌ రకాన్ని అభివృద్ధి ఇచేశారు. సాధారణంగా యాపిల్‌ చెట్లకు చలి కాలంలో నెలా పదిహేను రోజులు.. 7 డ్రిగ్రీల సెంటిగ్రేడ్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో డెవలప్‌ చేసిన వెరైటీ చెట్లు తక్కువ చలి వాతావరణంలోనూ మంచి దిగుబడిని ఇస్తాయి. ఈ మొక్కలు 45 డిగ్రీల టెంపరేచర్‌ని కూడా తట్టుకోగలవు. సాధారణ యాపిల్‌ చెట్లు 7 నుంచి 8 సంవత్సరాల తర్వాతే దిగుబడి ఇస్తాయి. కేఎల్‌డీ రకం మాత్రం రెండేళ్లలోనే కాయలు కాస్తున్నాయి.

అనంతపురం జిల్లాకు చెందిన రైతు రమణారెడ్డి ఇజ్రాయెల్‌ నుంచి 1500 మొక్కలను తెప్పించి తన పొలంలో నాటారు. శీతల యాపిల్‌ వెరైటీ అయితే ఎకరానికి 250 మొక్కలే నాటాలి. లో చిల్లింగ్‌ కేఎల్‌డీ యాపిల్ వెరైటీ సాగులో ఎకరానికి 1500 మొక్కలు నాటొచ్చు.

ఎక్కువ చెట్లు నాటితే దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. మన దగ్గర యాపిల్‌కి కేరాఫ్‌ అడ్రస్ అయిన హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతాల్లో ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు యాపిల్‌ పండ్లు మార్కెట్లోకి వస్తాయి. మన సీమలో పండుతున్న యాపిల్స్‌ డిసెంబర్‌లో పూతకు వచ్చి.. మార్చి చివరి నుంచి మేల నెల వరకు కాయలు కోతకు వస్తాయి. అంటే శిమ్లా యాపిల్‌ సీజన్ అయిపోయిన తర్వాత సీమ యాపిల్స్ వస్తాయి కాబట్టి.. మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది.

మన సీమ యాపిల్స్‌ ప్రస్తుతం కిలో 120 నుంచి 170 రూపాయల రేటు పలుకుతున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మహా నగరాలు దగ్గర్లో ఉండటంతో.. నేరుగా రిటైల్‌ స్టోర్లకు అమ్ముకుంటే.. రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమను ఉద్యాన పంటలకు అంతర్జాతీయ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

అనంతపురం జిల్లాలో యాపిల్‌ సాగు విజయవంతం కావడంతో.. సంప్రదాయంగా పండించే వేరు శనగ వంటి పంటల స్థానంలో యాపిల్‌ సాగును ప్రోత్సహించాలని భావిస్తున్నారు. యాపిల్‌ సాగులో ఎకరానికి 4 నుంచి 7 లక్షల రూపాలయ ఆదాయం వస్తుంది. రాయలసీమలో కెఎల్‌డీ రకం యాపిల్‌ సాగును విస్తరించడానికి ఉన్న అవకాశాలపై అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పంటకు రాయలసీమ అనువుగా ఉంటుందని రిపోర్ట్‌ వస్తే.. త్వరలో శిమ్లా యాపిల్స్‌కి మన సీమ రేగ్గాయలు పోటీ ఇవ్వడం ఖాయం.

Related posts

“మిరాకిల్” నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్: క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్

Satyam News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి మరో రూ. 8 వేల కోట్ల సాయం

Satyam News

శ్రీ కనక దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పణ

Satyam News

తిరుగుబాటు చేసి బలి అయిన కవిత

Satyam News

ట్రంప్ హెచ్చరికలతో వణుకుతున్న ఇరాన్

Satyam News

నెలరోజుల్లో అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్

Satyam News

Leave a Comment