ముఖ్యంశాలుహోమ్

జగన్ అక్రమాస్తుల కేసుల్లో ED స్పీడ్… ఢిల్లీలో హడావిడి

#YSJagan

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ చుట్టూ ED ఉచ్చు బిగిస్తోంది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణను వేగవంతం చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్ కేటాయింపుల వివాదాలకు సంబంధించిన వ్యవహారాల్లో జగన్‌తో పాటు ఇతర నిందితులపై 2 ప్రధాన ఛార్జ్‌షీట్లను సిద్ధం చేయడంపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

ఈ కేసుల్లో గతంలోనే ED అధికారులు కోర్టులో ఛార్జ్‌షీట్లు సమర్పించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలు,  ప్రక్రియ లోపాల వల్ల న్యాయస్థానం వాటిని వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో కోర్టు సూచించిన సాంకేతిక ప్రక్రియలను సరిచేయడంతో పాటు, అవసరమైన ఉన్నతాధికారుల అనుమతులు పొందడంపై ED వేగంగా అడుగులు వేస్తోంది.

జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు వివిధ అంశాలపై ED అధికారులు మొత్తం 9 ఛార్జ్‌షీట్లను నాంపల్లి CBI/ED ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. పెన్నా సిమెంట్స్, రామ్‌కీ, వ్యాపార పెట్టుబడులు సహా పలు కేసులకు సంబంధించి ఇప్పటికే దాఖలైన ఛార్జ్‌షీట్లపై విచారణ కొనసాగుతోంది.

తాజాగా దాల్మియా, భారతీ సిమెంట్స్ కేసులకు సంబంధించిన ఛార్జ్‌షీట్లను కూడా కోర్టు ఆమోదయోగ్యంగా రీ-ఫైల్ చేయడం ద్వారా ఈ కేసుల విచారణను వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని ED భావిస్తోంది. సాంకేతిక అడ్డంకులను తొలగించుకుని, మిగిలిన ప్రక్రియలను పూర్తి చేయడం ద్వారా కోర్టు విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఈ ఛార్జ్‌షీట్లు రీ-ఫైల్ అయి కోర్టు విచారణ పరిధిలోకి వస్తే జగన్‌కు న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులు తప్పవు. ఇప్పటికే ప్రజాప్రాతినిధ్య చట్టం, మనీ లాండరింగ్ చట్టాల కింద విచారణలు వేగవంతం కావడంతో, ప్రతిరోజూ కోర్టు హాజరు లేదా వ్యక్తిగత మినహాయింపులపై కోర్టు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అటు రాజకీయంగా ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో పాటు, ఆస్తుల జప్తు, కేసుల సుదీర్ఘ విచారణ ప్రక్రియతో జగన్‌ భవిష్యత్ మరింత ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది.

Related posts

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆధునిక టెక్నాలజీ

Satyam News

కోవర్టు ఆపరేషన్లతో రేవంత్ కు పరేషాన్

Satyam News

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం

Satyam News

జపాన్‌లో రెండో రోజు తెలంగాణ ప్రతినిధి బృందం పర్యటన

Satyam News

కొత్త కోడలిపై కిరాతకం: దుర్గమ్మతో ఆటలు…

Satyam News

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తాం

Satyam News

Leave a Comment