గుంటూరుహోమ్

రూ.38 లక్షల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీలో రూ. 38 లక్షల విలువైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆదివారం ప్రారంభించారు. పట్టణంలోని 31వ వార్డులో వల్లపు చెరువు వద్ద రూ.8 లక్షలతో ఎల్‌ఆర్‌ఎస్ గ్రాండ్ తో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే అరవింద బాబు ప్రారంభించారు.

అదేవిధంగా 33వ వార్డు సాయి నగర్లో మూడు బావుల సెంటర్ నుంచి హోసన్నా మందిరం వరకు సుమారు ఒక కిలోమీటర్ మేర ఎల్ఆర్ఎస్ గ్రాండ్ రూ.30 లక్షలతో నిర్మించిన 2 అడుగుల వెడల్పు సైడ్ డ్రైన్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం శంకుస్థాపన చేసిన ఈ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి పట్టణ ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు ఇన్‌చార్జులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఒకేసారి లక్ష మంది ప్రయాణికులు….

Satyam News

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

Satyam News

ఆర్ధిక నేరంలో అందమైన భామల విచారణ లేదు…

Satyam News

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు: ఆరు జిల్లాల్లో వారం రోజుల వేడుకలు

Satyam News

రామడుగులో తెలంగాణ విమోచన దినం

Satyam News

భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు

Satyam News

Leave a Comment