హైదరాబాద్హోమ్

నర్సింగ్ డైరెక్టరేట్ లో క్లినికల్ నర్సింగ్ కు ప్రాతినిధ్యం కల్పించాలి

#TelanganaNursesAssociation

తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ సేవలను మరింత బలోపేతం చేయడం, నర్సింగ్ పరిపాలనను శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరించడం, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న నర్సింగ్ డైరెక్టరేట్ల పనితీరును అధ్యయనం చేయడం కోసం G.O.Rt.No.302, Health, Medical & Family Welfare Department, dated 21-07-2026 ద్వారా ప్రభుత్వం చేపట్టిన చర్యను తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ (TNA) స్వాగతిస్తోంది.

అయితే, రాష్ట్రంలోని వేలాది మంది నర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే Directorate of Nursing వంటి కీలకమైన సంస్థాగత వ్యవస్థ రూపకల్పనలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యక్షంగా రోగి సేవలు అందిస్తున్న Clinical Nursing Cadre కు తగిన మరియు అర్థవంతమైన ప్రాతినిధ్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదని TNA స్పష్టం చేస్తోంది.

16,101 మంది క్లినికల్ నర్సింగ్ క్యాడర్‌కు ప్రాతినిధ్యం ఎందుకు ఉండకూడదు

Budget Estimates 2026–27, Appendix-A ప్రకారం:

– Clinical Nursing Cadre – 16,101

– Teaching Nursing Cadre – 797

– Total Nursing Cadre – 16,898

క్లినికల్ నర్సింగ్ క్యాడర్‌లో Chief Nursing Officer / Nursing Superintendent Grade-I, Deputy Nursing Superintendent / Nursing Superintendent Grade-II, Senior Nursing Officer / Head Nurse మరియు Nursing Officer / Staff Nurse వంటి కీలక హోదాలు ఉన్నాయి.

ఈ క్లినికల్ నర్సింగ్ సిబ్బందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ ప్రత్యక్ష రోగి సంరక్షణ, వార్డు నిర్వహణ, క్లినికల్ సూపర్విజన్, డ్యూటీ రోస్టర్ల నిర్వహణ, సిబ్బంది కేటాయింపు, అత్యవసర సేవలు, నర్సింగ్ ప్రమాణాల అమలు మరియు ఆసుపత్రి నర్సింగ్ పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అందువల్ల నర్సింగ్ డైరెక్టరేట్ నిర్మాణం, క్యాడర్ పునర్వ్యవస్థీకరణ, పోస్టుల నిర్మాణం, పదోన్నతులు, పోస్టింగులు, బదిలీలు, సిబ్బంది అవసరాలు, శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి మరియు కెరీర్ ప్రోగ్రెషన్ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముందు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా సేవలందిస్తున్న క్లినికల్ నర్సింగ్ అధికారుల అనుభవం మరియు వాస్తవ పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి దీర్ఘకాలిక ప్రాతినిధ్యం

Telangana Nurses Association (TNA) తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ నర్సింగ్ సిబ్బంది వృత్తిపరమైన ప్రయోజనాలు, సేవా పరిస్థితులు, సంక్షేమం మరియు నర్సింగ్ సేవల అభివృద్ధి కోసం దీర్ఘకాలంగా పనిచేస్తున్న ప్రాతినిధ్య సంస్థ.

సంఘం 1963లో ఏర్పడి, అనంతరం Societies Registration Act కింద Registration No.126/1982తో నమోదైంది. అదేవిధంగా, తెలంగాణ నర్సస్ అసోసియేషన్ (TNA) మరియు ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అసోసియేషన్ (Regd. No.21) విలీనంతో ఏర్పడిన Unified Andhra Pradesh Government Nurses Associationను ప్రభుత్వం G.O.Ms.No.358, General Administration (GAD-N) Department, dated 05-06-2008 ద్వారా అధికారికంగా గుర్తించింది.

ఈ ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి సంబంధించి సంఘం ప్రాతినిధ్య పాత్రకు ప్రభుత్వ గుర్తింపు లభించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా TNA ప్రభుత్వ నర్సింగ్ సిబ్బంది వృత్తిపరమైన ప్రయోజనాలు, సేవా పరిస్థితులు, సంక్షేమం మరియు నర్సింగ్ సేవల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల దృష్టికి నిరంతరం తీసుకెళ్తూ తన ప్రాతినిధ్య బాధ్యతను కొనసాగిస్తోంది.

అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ సేవల భవిష్యత్తును ప్రభావితం చేసే Directorate of Nursing ఏర్పాటు ప్రక్రియలో TNAతో పాటు సంబంధిత నర్సింగ్ సంఘాలు మరియు వివిధ విభాగాలకు చెందిన క్లినికల్ నర్సింగ్ ప్రతినిధులతో ప్రభుత్వం అధికారికంగా సంప్రదింపులు జరపడం అత్యంత సముచితమని TNA భావిస్తోంది.

ప్రభుత్వం సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలి

Government of Andhra Pradesh, HM&FW Department, Memorandum No.1912/K1/89-24, dated 06-05-1993 లో (d) In case Government/Head of the Department proposes to consider any issue of general nature and which is triggered by a representation from unrecognised union/Association, examination of the case should be taken up only after providing an opportunity to the recognised union/association to offer their remarks on the proposal. (Action all Service Sections in the Department).)

పేర్కొన్న పరిపాలనా సూత్రం ప్రకారం, సాధారణ స్వభావం కలిగిన అంశాలపై సంబంధిత గుర్తింపు పొందిన సంఘం/సంస్థ అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం కల్పించడం అవసరమని పేర్కొనబడింది.

ఈ పరిపాలనా సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని, నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంలో సంబంధిత నర్సింగ్ సంఘాలను పిలిపించి, వారి అభిప్రాయాలు, సూచనలు మరియు ప్రతిపాదనలను అధికారికంగా స్వీకరించి, వాటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని TNA గౌరవపూర్వకంగా కోరుతోంది.

ఇది ఎవరి మీదా విమర్శ కాదు.

ఇది ఎటువంటి విభేదాలకు దారితీయాలనే ఉద్దేశంతో చేస్తున్న డిమాండ్ కాదు. నర్సింగ్ సేవల భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయంలో, ఆ సేవలను ప్రత్యక్షంగా అందిస్తున్న నర్సింగ్ క్యాడర్ గొంతు కూడా వినిపించాలనే న్యాయమైన మరియు వృత్తిపరమైన అభ్యర్థన మాత్రమే.

TNA ప్రధాన డిమాండ్లు

  1. G.O.Rt.No.302 ప్రకారం ఏర్పాటు చేసిన Study Teamsలో అనుభవజ్ఞులైన Clinical Nursing Officers / Senior Nursing Officers / Nursing Superintendentsకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
  2. Telangana Nurses Association ప్రతినిధిని Study Teamలో లేదా తదుపరి అధికారిక Consultation Processలో భాగస్వామ్యం చేయాలి.
  3. నర్సింగ్ డైరెక్టరేట్ తుది నిర్మాణాన్ని ఖరారు చేసే ముందు సర్వీసులో ఉన్న Clinical Nursing Cadreతో విస్తృత స్థాయి సంప్రదింపులు నిర్వహించాలి.
  4. ప్రతిపాదిత Directorate of Nursingలో Clinical Nursing Cadreకు వారి సంఖ్య, బాధ్యతలు మరియు క్షేత్రస్థాయి అనుభవానికి అనుగుణంగా సముచితమైన ప్రాతినిధ్యం కల్పించాలి.
  5. డైరెక్టరేట్‌లోని సాంకేతిక మరియు వృత్తిపరమైన ఉన్నత హోదాలను విద్యార్హతలు, వృత్తిపరమైన అర్హతలు, క్లినికల్ మరియు పరిపాలనా అనుభవం, సీనియారిటీ మరియు వర్తించే సర్వీస్/ప్రమోషన్ నిబంధనల ప్రకారం అర్హులైన Nursing Professionalsతో భర్తీ చేయాలి.
  6. Director of Nursing వంటి కీలకమైన ఉన్నత హోదాలకు వృత్తిపరమైన అర్హతలు, క్లినికల్ అనుభవం, పరిపాలనా సామర్థ్యం, సీనియారిటీ మరియు ప్రమోషన్ అర్హతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
  7. నర్సింగ్ క్యాడర్ నిర్వహణ, పదోన్నతులు, పోస్టింగులు, బదిలీలు, శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి, మానవ వనరుల ప్రణాళిక మరియు సిబ్బంది హేతుబద్ధ వినియోగం కోసం సమగ్ర మరియు పూర్తిస్థాయి Directorate of Nursing ఏర్పాటు చేయాలి

సమతుల్య ప్రాతినిధ్యంతోనే బలమైన నర్సింగ్ డైరెక్టరేట్

Teaching Nursing Cadreలో సుమారు797 మంది ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యక్షంగా సేవలందిస్తున్న Clinical Nursing Cadre సంఖ్య 16,101గా ఉంది.

అందువల్ల నర్సింగ్ డైరెక్టరేట్ నిర్మాణం విషయంలో ఏ ఒక్క విభాగం అభిప్రాయానికే పరిమితం కాకుండా, Clinical Nursing, Teaching Nursing మరియు ఇతర సంబంధిత Nursing Wingsకు చెందిన అనుభవం, అవసరాలు మరియు సూచనలను సమతుల్యంగా పరిగణనలోకి తీసుకోవాలని TNA కోరుతోంది.

ప్రత్యేకంగా Clinical Sideలో పనిచేస్తున్న Nursing Officers ఎదుర్కొంటున్న patient-care burden, manpower requirements, duty patterns, clinical responsibilities, promotions, transfers, postings మరియు career progression వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నర్సింగ్ అధికారులు అత్యంత వాస్తవికంగా వివరించగలరు.

అందువల్ల “నర్సింగ్ కోసం నర్సింగ్ క్యాడర్ అనుభవం” నర్సింగ్ డైరెక్టరేట్ రూపకల్పనలో కీలకమైన అంశంగా ఉండాలి.

ప్రభుత్వానికి TNA విజ్ఞప్తి

నర్సింగ్ డైరెక్టరేట్ అనేది కేవలం ఒక పరిపాలనా ఉత్తర్వు కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది నర్సింగ్ ఉద్యోగుల సేవా భవిష్యత్తు, పరిపాలనా వ్యవస్థ, పదోన్నతులు, పోస్టింగులు, వృత్తిపరమైన అభివృద్ధి మరియు రాబోయే తరాల నర్సింగ్ సేవలపై ప్రభావం చూపే దీర్ఘకాలిక సంస్థాగత సంస్కరణ.

కాబట్టి ఈ ప్రక్రియలో పారదర్శకత – సమతుల్య ప్రాతినిధ్యం – వృత్తిపరమైన నాయకత్వం – క్షేత్రస్థాయి అనుభవం – విస్తృత సంప్రదింపులు అనే అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్రభుత్వం సంబంధిత నర్సింగ్ సంఘాలు, Clinical Nursing Cadre మరియు ఇతర భాగస్వామ్య వర్గాలతో చర్చించి, అందరి అభిప్రాయాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర నర్సింగ్ సేవల ప్రయోజనాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటుందని TNA ఆశిస్తోంది.

Clinical Nursing Cadre ప్రయోజనాలకు విరుద్ధంగా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడితే, TNA తన సభ్యులతో విస్తృతంగా చర్చించి, ప్రజాస్వామ్య మరియు చట్టబద్ధమైన మార్గాల్లో తదుపరి కార్యాచరణను నిర్ణయించి ప్రకటించాల్సి వస్తుంది.

అవసరమైన సందర్భంలో రాష్ట్రంలోని Clinical Nursing Officersతో పాటు ప్రజారోగ్య విభాగంలోని సంబంధిత ఆరోగ్య సిబ్బందితో కూడా సమన్వయం చేసుకుని, న్యాయబద్ధమైన మరియు ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ అభిప్రాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. TNA మొదటి ప్రాధాన్యత ఎల్లప్పుడూ చర్చ, సంప్రదింపులు, పరస్పర అవగాహన మరియు సానుకూల సంభాషణ ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనడం అని తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ (TNA) తెలిపింది.

Related posts

పసికందును అమ్మిన తల్లి అరెస్టు

Satyam News

రాఘవ్ చద్దా తొలగింపునకు అసలు కారణం ఏమిటి?

Satyam News

వాట్సాప్ కొత్త ఫీచర్: వివరాలు ఇవే

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

Satyam News

బంగారం కొనొద్దని ప్రధాని చెప్పింది ఇందుకే..

Satyam News

కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీదారుడి అరెస్టు

Satyam News

Leave a Comment