28.7 C
Hyderabad
April 28, 2024 04: 14 AM
Slider నల్గొండ

జర్నలిస్టులకు ఇంటి స్థలం మంజూరు చేయాలి

#UttamKumarReddy

నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని,తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో పాటుగా జర్నలిస్టులు నిరహార దీక్షలు,ర్యాలీలు,ఆందోళనలు చేశారని,సకల జనులను ముందుండి నడిపారని, ఎండనక, వాననక, పగలనక, రేయనక నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని,కరోనా సమయంలో ధైర్యంగా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి వచ్చేలా పనిచేశారని,ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారని హుజూర్ నగర్ పట్టణ,మండల పాత్రికేయులు ఎంతోమంది జీవన వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారని,దశాబ్ద కాలంగా జర్నలిజంలో ఉన్న దిగువ మధ్యతరగతి జర్నలిస్టులు అందరికీ హుజూర్ నగర్ పట్టణంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మంగళవారం ఆర్డీవో కి నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ వ్రాసారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఫణిగిరి సీతారామచంద్రస్వామి గట్టు వద్ద తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయములో సేకరించిన ఎంతో విలువైన స్థలం ఉందని,హుజూర్ నగర్ లో ఉన్న జర్నలిస్టు మిత్రులకు ఒక్కొక్కరికి 200 గజముల ఇంటి స్థలాన్ని మంజూరు చేయాలని,ఇట్టి స్థలముతో పాటు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విధముగా ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు నగదును కూడా మంజూరు చేసి సహకరించాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఆర్డీవో  కి లేఖ వ్రాసారు.

2014 లో అప్పటి కాంగ్రెస్ పార్టీ హయాంలో జర్నలిస్టుల సంక్షేమానికి తాను ఎంతో కృషి చేశానని, ఫణిగిరి సీతారామచంద్రస్వామి గట్టు వద్ద పేదలకు, జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైన కాలనీ ఏర్పాటుకు స్థల సేకరణ చేశామని,ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఎండోమెంట్ నుండి కోర్టు అనుమతి తీసుకుని రెవిన్యూ శాఖకు మార్చటం జరిగిందని,అట్టి స్థలం జర్నలిస్టులకు ఇచ్చేందుకు అనువుగా ఉన్నందున ఒక్కొక్క పాత్రికేయ మిత్రునికి 200 గజాల చొప్పున ఇంటి స్థలం మంజూరు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ రెవిన్యూ డివిజన్ అధికారికి మంగళవారం వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఘనంగా కాటమయ్య పండుగ

Bhavani

విద్యల నగరంలో విద్యార్ధులతో మాటకలిపిన మంత్రి బొత్స

Satyam NEWS

సేఫ్:పాఠశాల వ్యాన్ బోల్తా విద్యార్థులకు గాయాలు

Satyam NEWS

Leave a Comment