శ్రీకాకుళంహోమ్

24న వినియోగదారుల హక్కుల దినోత్సవం

#Srikakulam

జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలకు తరలిరావాలని కోరుతూ ఆశ్రా ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. శ్రీకాకుళంలో డిసెంబర్ 19 జరిగిన ఈ కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా ఆస్రా అధ్యక్షులు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా పిలుపు నిచ్చారు.

శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ చాంబర్స్ లో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ నెల 24 న జరగనున్న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకల్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడే సంఘాలు అన్ని భాగస్వామ్యం కావాలన్నారు.

గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శాసఫు జోగినాయుడు, పీజీ గుప్తా, నాగేశ్వర ఈశ్వరరావు, గుడ్ల గోపాలరావు, మెట్ట దనుంజియ భట్ల, ఆసరా ప్రతినిధులు కె. పి. సారధి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహిళా పోలీసుల గౌరవాన్ని కించపరిచేలా బీఆర్‌ఎస్‌ నేతల తీరు

Satyam News

మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే

Satyam News

భారత్ రష్యా బంధం మరింత ధృఢంగా ముందుకు…

Satyam News

‘కాక్రోచ్’ రాజకీయ పార్టీ ఇప్పుడే కాదు….

Satyam News

గుంక‌లాంలో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

Satyam News

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

Satyam News

Leave a Comment