26.3 C
Hyderabad
September 19, 2026
సంపాదకీయంహోమ్

నిన్న BR నాయుడు..ఇవాళ ABN…. జగన్‌ శత్రువులు ఎవరు?

#Jaganys

నిన్న టీవీ5 BR నాయుడు, నేడు ఏబీఎన్ RK..ఇలా వరుసగా మీడియా అధినేతలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహమా లేక వ్యాపారపరమైన శత్రుత్వమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల లోపాలను, ప్రభుత్వాల తప్పులను ఎండగట్టడం మీడియా బాధ్యత. అయితే ఆ విమర్శలను స్వీకరించలేక వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. మొన్న BR నాయుడుపై కుట్రలు చేసినట్లే, ఇవాళ ఆంధ్రజ్యోతి ఆర్కేపై దాడి చూస్తుంటే, తనను ప్రశ్నించే గొంతుక ఏదైనా సరే అది తన శత్రువే అన్నట్లుగా జగన్ వైఖరి కనిపిస్తోంది.

అసలు జగన్ ఎదుర్కొంటున్నది తన రాజకీయ ప్రత్యర్థులనా లేక తన సొంత మీడియా సంస్థ అయిన సాక్షికి అడ్డుగా ఉన్న వ్యాపార ప్రత్యర్థులనా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. స్వయంగా ఒక మీడియా సంస్థకు యజమానిగా ఉండి, ఇతర మీడియా సంస్థల స్వేచ్ఛను హరించాలని చూడటం అత్యంత అప్రజాస్వామికమని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ దాడులు కేవలం ఒక కార్యక్రమంపై నిరసనగా కాకుండా, సాక్షికి దీటుగా ఉన్న సంస్థలను భయభ్రాంతులకు గురిచేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాజకీయ విమర్శలను రాజకీయంగా ఎదుర్కోకుండా, ఏకంగా ఆఫీసులపైకి రౌడీ మూకలను పంపడం మీడియా అస్తిత్వంపైనే దాడి చేయడం వంటిదని మేధావులు భావిస్తున్నారు.

మహిళలను కించపరిచారనే నెపంతో వైసీపీ నేతలు చేస్తున్న రభసలో ఏమాత్రం నిజాయితీ లేదని సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ సైతం తీవ్రంగా ఖండించాయి. సొంత కుటుంబంలోని మహిళలకే రక్షణ ఇవ్వని వారు, రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు మహిళా గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వారు విమర్శిస్తున్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు చేసిన వ్యక్తిత్వ హననం, సభ్యసమాజం తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలు ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు మీడియాపై దాడులు చేయడానికి ఆ పార్టీ వారు దీన్ని ఒక వంకగా వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌లోని ABN హెడ్‌ ఆఫీసు దగ్గర ఆందోళనకు దిగి, లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శనం. జగన్ దృష్టిలో శత్రువులంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, తన అరాచకాలను ప్రజల ముందుంచే పత్రికా ప్రతినిధులు కూడా అని అర్థమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేధించిన వైసీపీ, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా అదే తరహా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఆ పార్టీ దిగజారుడుతనానికి అద్దం పడుతోంది.

Related posts

దేశ ఆహార శుద్ధి రంగంలో 9% వాటాతో ఏపీ నంబర్ వన్

Satyam News

బొండా ఉమా వివరణ తీసుకోండి.. చంద్రబాబు ఆదేశాలు

Satyam News

అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ

Satyam News

వనపర్తి మున్సిపల్ చైర్మన్ సీటులో పోటీ

Satyam News

మంగళగిరి వేదికగా ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026

Satyam News

కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

Satyam News

Leave a Comment