ముఖ్యంశాలుహోమ్

ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?

#HarishRaoBRS

“ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?” అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అని చెప్పుకునే ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు కూడా అందించలేని దుస్థితిలో ఉందా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకచోట విద్యార్థులకు యూనిఫారాలు అందలేదని, అందిన చోట కూడా కొలతలు సరిగ్గా లేవని హరీశ్ రావు ఆరోపించారు. యూనిఫారాల కుట్లు ఊడిపోతున్నాయని, ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయని అన్నారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు ఇవ్వాల్సి ఉండగా, చాలా ప్రాంతాల్లో ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని పేర్కొన్నారు.

తెలంగాణ చేనేత కార్మికులపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని హరీశ్ రావు విమర్శించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, కమీషన్ల కోసం పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించి విద్యార్థులకు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.

“మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు” అన్నదే ప్రభుత్వ వైఖరిగా మారిందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి పడుతుండగా, మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందుతున్నాయని అన్నారు.

నాసిరకం యూనిఫారాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫారాలు అందించడంతో పాటు స్థానిక చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకం యూనిఫారాల సరఫరాపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts

జోగి రమేష్… బాత్రూమ్ కిటికీ నుంచి పారిపోయే ప్రయత్నం

Satyam News

టీటీడీ చైర్మన్ పై వైసీపీ డీప్ ఫేక్ ప్రచారం

Satyam News

సీఎం సారూ…. నన్ను బతికించండి..: కీర్తన

Satyam News

తొలి ప్రవాస భారతీయుని బయోగ్రఫీ “జిందగీ ఇన్ టు షేడ్స్”

Satyam News

సస్పెన్షన్ బాధతో ఏఎస్సై ఆత్మహత్య

Satyam News

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News

Leave a Comment