ముఖ్యంశాలుహోమ్

చిట్యాల వద్ద ప్రమాదం: నలుగురు మృతి

#Accident

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక ఏడేళ్ల బాలుడు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాద సమయంలో కారు చిట్యాల నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Related posts

వైసీపీ వర్గపోరులో నవులూరి చెన్నారెడ్డి బలి

Satyam News

ముడి చమురు ధరలతో మార్కెట్లు పతనం

Satyam News

సొంత చెల్లి గుర్తు లేదా..?? రాదా…?? జగన్‌..??

Satyam News

సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

Satyam News

31న సీఎం చేతుల మీదుగా వెలిగొండ ప్రారంభోత్సవం

Satyam News

అగ్నివీర్ పాలసీలో భారీ మార్పులు….?

Satyam News

Leave a Comment