హైదరాబాద్హోమ్

హైదరాబాద్ లో త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

#Ponguleti

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు  త్వరలోనే ఇళ్ల స్థలాలను  అందించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు.

బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రిని కలిసి, ఇటీవల జరిగిన తమ సంఘ రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలతో కూడిన వినతి పత్రాన్ని అందించింది.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు చేసిన సానుకూల ప్రకటనపై తమ సంఘ కార్యవర్గ సమావేశం కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ప్రక్రియను వేగవంతం చేసి జర్నలిస్టుల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించాలని

ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినట్లు విరాహత్ అలీ, రాంనారాయణలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే  మరో ప్రధాన సమస్య అయిన ఆరోగ్య పథకాన్ని  అమలు చేసి, జర్నలిస్టుల ప్రాణాలకు ప్రభుత్వం భద్రతా కల్పించాలని తమ సంఘం చేసిన తీర్మానాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ ముందుగా హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు చేపడతామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్ లు ఉన్నారు.

Related posts

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Satyam News

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెకు  మరమ్మతులు

Satyam News

ఎర్రగుంట్లలో రూ.2.52 కోట్లు పట్టివేత

Satyam News

విద్యుత్ సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి సిద్ధం

Satyam News

పెరిగిపోతున్న షుగర్ డాడీ కల్చర్

Satyam News

అమ్మ ఒడి vs తల్లికి వందనం.. ఏ స్కీమ్‌తో ఎక్కువ లాభం?

Satyam News

Leave a Comment