27.1 C
Hyderabad
September 28, 2026
కర్నూలుహోమ్

హైడ్రాలిక్ ఎక్స్కవేటర్‌తో గుర్రపు డెక్క తొలగింపు

#Kurnool

కర్నూలు నగర పరిధిలోని కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహంతో గుర్రపు డెక్క కొట్టుకుపోకుండా ఒకేచోట పేరుకుపోతున్న ప్రాంతాల్లో వాటిని తొలగించేందుకు చర్యలను ముమ్మరంగా చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. సోమవారం ఆయన వినాయక ఘాట్‌, జోహరాపురం వంతెన ప్రాంతాల్లో జరుగుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను పరిశీలించారు. వంతెనల పిల్లర్ల వద్ద గుర్రపు డెక్క పెద్దమొత్తంలో పేరుకుపోకుండా హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ సహాయంతో తొలగిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, డిఈఈ పవన్ కుమార్ రెడ్డి, వెహికల్ ఇంచార్జీ కురుబ మధుబాబు, సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, ఇంస్పెక్టర్ ఫరూక్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతి

Satyam News

ముడి చమురు ధరలతో మార్కెట్లు పతనం

Satyam News

100% రాయితీపై చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ

Satyam News

న్యాయమూర్తిపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన కేజ్రీవాల్

Satyam News

రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Satyam News

శ్రీ స్వామి రామానందుల వారి సమాధి ఆరాధన

Satyam News

Leave a Comment