23.9 C
Hyderabad
September 27, 2026
తూర్పుగోదావరిహోమ్

గీతా కృష్ణపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

#MahasenaRajesh

మాల మాదిగలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు గీతా కృష్ణపై కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటీవల గీతా కృష్ణ మాల మాదిగలపై ఒక యూట్యూబ్ ఛానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వార్తలోని అనుచిత భాగాలను ఎడిట్ చేయకుండా ఛానెల్ ద్వారా ప్రసారం చేసినందుకే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మాత్రమే కాదు, యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం మరియు ఆ ఛానెల్ యాంకర్‌పై కూడా ఫిర్యాదు నమోదు చేసినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.

గీతా కృష్ణ పై ఇదే తొలి ఫిర్యాదు కాదు. గతంలో కూడా ఆయన చేసిన కామెంట్లు, సినీరంగ నటినటులపైనా, హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు మరియు పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదు చేయించిన విషయం తెలిసిందే. స్థానిక సంఘాలు, మాల-మాదిగ సంఘాల నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి, బాధిత సముదాయానికి సహాయం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కు విజ్ఞప్తి చేశారు.

మాల, మాదిగల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ గీతా కృష్ణ పైనా, తెలుగురాజ్యం అనే యూట్యూబ్ ఛానెల్ యాజమాన్యం & యాంకర్ పైనా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు (క్రైమ్ NO -235/2025) అయినట్లు మహాసేన రాజేశ్ తెలిపారు. రిజర్వేషన్ లు కేవలం మాల మాదిగలకి మాత్రమే కాదు అన్ని కులాలకు ఉన్నాయని ఆయన తెలిపారు. BC – 27. 5%, ST – 7.5%, అగ్రవర్ణ పేదలు – 10%, మాల – 7.5%, మాదిగ-6.5%, రెల్లి – 1%, OC – 40%.. ఇలా అన్ని కులాలకు రిజర్వేషన్స్ ఉన్నాయి.. ముందు ఇవి తెలుసుకోవాలని రాజేశ్ కోరారు.

Related posts

కృష్ణా ,గోదావరి నదుల్లో భారీ వరద

Satyam News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రెడీ… ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు

Satyam News

సస్పెన్షన్ బాధతో ఏఎస్సై ఆత్మహత్య

Satyam News

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఒమన్ మధ్య కీలక ఒప్పందం

Satyam News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం తోనే సమగ్ర క్రీడాభివృద్ధి

Satyam News

రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు తరలింపు

Satyam News

Leave a Comment