కృష్ణహోమ్

2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదు

#CBN

ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని జూలై 2026 నెలవారీ ఆర్ధిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా నమోదు అవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5 శాతం నమోదు చేస్తే 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 9.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదు అవుతున్నట్టు నెలవారీ ఆర్ధిక నివేదిక పేర్కొంది.

ఈమేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా విభాగం అధికారులు 2026 జూలై ఆర్ధిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించారు. 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక రంగం 10.6 శాతం మేర, సేవా రంగం 9.9 శాతం వృద్ధితో ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి.

పశుసంవర్ధక శాఖలో మాంసం ఉత్పత్తి 9.6 శాతం, గుడ్ల ఉత్పత్తి 5.1 శాతం వృద్ధిని సాధించాయి. సేవా రంగంలో ఐటి, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ ఎగుమతుల్లో రూ. 16,322 కోట్లతో 10.5 శాతం మేర వృద్ధి నమోదు అయ్యింది. ఎస్‌టిపిఐ (STPI) ఎగుమతులు 32.2 శాతం మేర పెరిగాయి, అలాగే వాణిజ్య వాహనాల నమోదు 51.6 శాతం వృద్ధిని కనబరిచింది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెక్నాలజీ ఇంటిగ్రేషనుతో జీఎస్టీ పన్ను వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.13,282 కోట్లకు చేరాయి. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కూడా ఆశాజనకంగా ఉంది. రూ. 2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబులు గ్రౌండింగ్ తో 75.4 శాతం మేర, రూ. 60 వేల కోట్ల మేర ఎంఎస్‌ఎంఈ రంగ పెట్టుబడులు 73.6 వృద్ధిని నమోదు చేశాయి. పన్ను, పన్నేతర ఆదాయాల్లో గణనీయంగా వృద్ధి నమోదు అయ్యింది. ఫలితంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది.

ఎల్ నినో సంక్షోభంలో లక్ష్యాల్ని సాధించాలి

ఎల్ నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికా విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.

వాణిజ్య పన్నుల శాఖ తరహాలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ టెక్నాలజీని సమర్ధంగా అనుసంధానించి లక్ష్యాలను చేరుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉందని కృష్ణా నదిలో ప్రవాహాలు లేని కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా నిండలేదని.. గోదావరికి వచ్చిన వరద ప్రవాహాలను మళ్లించి కృష్ణా డెల్టాకు నీరిచ్చామని సీఎం పేర్కొన్నారు.

భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయని.. ఈ నేపథ్యంలో స్థూల ఉత్పత్తి పడిపోకుండా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి లోటుపాట్లను సరిచేసుకోవాలన్నారు. ప్రతీ ప్రభుత్వశాఖ అత్యున్నత స్థాయి లక్ష్యాలను చేరుకునేలా వనరుల నిర్వహణ చేపట్టాలన్నారు. నిర్దుష్టమైన ప్రమాణాలను అనుసరించి ఫలితాలు వచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.

రూపోందించే ప్రతీ ప్రణాళికా రాష్ట్ర వృద్ధిరేటును పెంచేలా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలపై ఎలాంటి ధరల భారం పడకుండా చూడాలని దీనిపై ఓ కమిటీ వేయాలని సూచించారు. నీటి లభ్యత, ఉత్పత్తులకు విలువ జోడింపు లాంటి అంశాలపై సూచనాత్మక కంటిజెన్సీ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఏపీ 15 శాతం వృద్ధిరేటు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి కావాల్సిన ఉత్పత్తులపై ప్రభావం లేకుండా చూడాలన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలవారీగా నివేదికలు ఇస్తే లక్ష్యాల సాధన సులువు అవుతుందని సీఎం సూచించారు. ఈ సమీక్షకు ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ప్రణాళికా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్ అలపర్తి, సీఎంఓ అధికారులు రాజమౌళి, ప్రద్యుమ్న తదితరులు హాజరయ్యారు.

Related posts

గాదె ఇన్నయ్య అరెస్టు అన్యాయం

Satyam News

షర్మిల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

Satyam News

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News

కృష్ణా ,గోదావరి నదుల్లో భారీ వరద

Satyam News

అమరావతిలో గ్రంథాలయం కోసం రూ.100 కోట్ల విరాళం

Satyam News

హుస్నాబాద్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

Leave a Comment