మహబూబ్ నగర్హోమ్

ఎన్ ఆర్ ఐలు పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవాలి

#ATAMeetings

అమెరికా లోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న ఆటా 19 వ మహాసభల రెండో రోజు సందడిగా సాగింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. రెండో రోజు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అమెరికాలో తెలుగు వారి స్ఫూర్తిని కొనియాడారు. కాంగ్రెస్, BRS, BJP, TDP, YSRCP నుంచి ముఖ్యనాయకులు బాంక్వెట్ హాల్ మీటింగు కు హాజరై ప్రసంగించారు.

తెలంగాణ పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవాలని ATA, ఎన్ఆర్ఐలకు మంత్రి జూపల్లి పిలువు ఇచ్చారు. తెలంగాణ పర్యాటక ప్రమోషన్ లో ఎన్ఆర్ఐ భాగస్వాములు కావాలి అని కోరారు. హైదరాబాద్‌లో రూ.10 కోట్లతో ఎన్ఆర్ఐ భవన్‌కు కృషి చేస్తామని ప్రకటించారు.

సామాజిక రుగ్మతల నిర్మూలనకు త్వరలోనే ‘ప్రభాత భేరికి శ్రీకారం చుడతామన్నరు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణలో ATA సేవలు అభినందనీయం అన్నారు. 19 వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మహాసభల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

తెలంగాణ పర్యాటక ప్రమోషన్ లో ఎన్ఆర్ఐ భాగస్వాములు కావాలని, అమెరికాలోని మీ మిత్రులు, విదేశీ సహోద్యోగులకు తెలంగాణ పర్యాటక వైభవాన్ని పరిచయం చేసి, సెలవుల్లో వారిని తెలంగాణకు తీసుకువచ్చి రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మహాసభల్లో  పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం సప్త సముద్రాలు దాటి అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలు అక్కడి ఆర్థిక, సాంకేతిక పురోగతికి విశేషంగా దోహదపడుతున్నారని, అదే సమయంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో సజీవంగా నిలబెట్టడంలో వారి పాత్ర మరింత గొప్పదని కొనియాడారు.

1990లో ఏర్పాటైన ATA అమెరికాలోని తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పుట్టి పెరిగిన పల్లెల అభివృద్ధికి ప్రవాసులు అందిస్తున్న సహకారం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఎన్ఆర్ఐలు అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

హైదరాబాద్ లో ఎన్ ఆర్ ఐ భవనం

అమెరికా నుంచి తెలంగాణకు వచ్చే ప్రవాస భారతీయులకు అన్ని సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా హైదరాబాద్‌లో రూ.10 కోట్ల వ్యయంతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ భవన్ ప్రవాస భారతీయులకు సమన్వయ కేంద్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

తెలంగాణలో అపారమైన పర్యాటక సామర్థ్యం ఉందని, దానిని ప్రపంచానికి పరిచయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ATA బృందాలు లేదా ఎన్ఆర్ఐ గ్రూపులు దత్తత తీసుకుని, వాటి అభివృద్ధి, పరిరక్షణ, పునరుద్ధరణకు చేయూత అందించాలని కోరారు.

సమాజంలో జీవన విధానం ఆందోళనకరంగా మారుతోందని మంత్రి జూపల్లి అన్నారు. విద్య, వైద్యం పేరుతో ప్రజలు తమ తాహతుకు మించి కార్పొరేట్ సంస్థల్లో ఖర్చు చేస్తున్నారని, ప్రభుత్వం ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ కార్పొరేట్ స్థాయిలో సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సామాజిక హోదా కోసం కొందరు పెళ్లిళ్లు, పేరంటాలు, ఇతర వేడుకలను ఆర్భాటంగా నిర్వహించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని పొదుపు చేసుకోవాలని హితవు పలికారు. యువత వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, ఇటువంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం కల్పించే లక్ష్యంతో ‘ప్రభాత భేరి’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సామాజిక ఉద్యమంలో ప్రవాస భారతీయులు కూడా తమ వంతు సహకారం అందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

మరోవైపు అమెరికా లోని ఒక రాష్ట్రం లా తెలంగాణ ను కెసిఆర్ అభివృద్ది చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. NRI లు తెలంగాణ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని కోరారు. తెలుగు ప్రజలు అమెరికాలో కష్టపడి ఎదిగి ఆదర్శంగా నిలిచారు అని ప్రశంసించారు. ఆటా మహాసభల సందర్భంగా బంక్వెట్ సమావేశంలో ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడారి కిషోర్, పుట్ట మధు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలమల్లు, కర్నాటి విద్యాసాగర్, థి కంచర్ల కృష్ణారెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఇన్‌చార్జ్ మహేష్ తన్నీరు, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, చందు తాళ్లా, నరసింహ నాగులవంచ, రజనీకాంత్ కోసనం పాల్గొన్నారు. రెండు తెలుగు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారిగా కలిసి ఉండాలి

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు గా కలిసి ఉందాం అని కోరారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణంతో BRS సీనియర్ నేత హరీష్ రావు ఆటా మహాసభల కు హజరుకలేకపోయారని చెప్పారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి అన్నారు.

అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర కీలకంగా ఉందని బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ రామచంద్ర రావు అన్నారు. అమెరికా వచ్చినా భారతీయ సంసృతి ని కాపాడు కోవడం అభినందనీయం అన్నారు. అన్ని దేశాలలో  సత్సంబంధాలు ఉండేలా ప్రధాని మోడీ కృషి చేశారని అన్నారు. తమ సంసృతి కాపాడుకుంటూనే తెలుగుదనాన్ని నిలబెట్టడం లో ఆటా పాత్ర కీలకం అన్నారు. రెండో రోజు అమెరికాలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో 19వ మహాసభ ల్లో రామచంద్ర రావు పాల్గొని మాట్లాడారు..

రెండో రోజు ఆటా మహాసభల సందర్భంగా అనేక ప్రోగ్రాములు జరిగాయి. ఉదయం  130 మంది కళాకారులు బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనిల్ బోయినపల్లి ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ ఫోరమ్ లో మేరీల్యాండ్ గవర్నర్ అరుణ మిల్లర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహిత్య వేదిక, ఉమెన్ ఫోరమ్ సమావేశాలలోనే వందలాది మంది పాల్గొన్నారు.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చర్ నేతృత్వంలో జరిగిన ఫ్యాషన్ షో కళ్ళు జిగేల్ మన్నాయి. తెలంగాణ చేనేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన వస్త్రాలతో వందల మంది యువతీ యువకులు ఈ షోలో పాల్గొన్నారు.

పరంపర పేరుతో చేసిన శివ పార్వతుల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. యుఎస్ ఆర్మీ లో సేవలు అందించిన తెలుగు వారిని ఆటా వేదికగా ప్రత్యేకంగా సన్మానించారు. ఆటా మహాసభల వేడుకలకు స్పాన్సర్ చేసిన వారి కుటుంబాలను కూడా అభినందించారు. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, పూజ హెగ్డే , రీతూ వర్మ రెండో రోజు సమావేశాల్లో పాల్గొన్నారు.

Related posts

సస్పెన్షన్ బాధతో ఏఎస్సై ఆత్మహత్య

Satyam News

స‌ర్ విజ్జీ స్టేడియంను ప‌రిశీలించిన గోవా గ‌వ‌ర్న‌ర్

Satyam News

తిరుమల ల్యాబ్ పై రాజకీయం మొదలెట్టిన వైసీపీ

Satyam News

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News

కాక్రోచ్ ల ఆందోళన వెనుక సీపీఎం ద్వారా చైనా పాత్ర ఉందా?

Satyam News

ప్రపంచ క్వాంటమ్‌ కంప్యూటంగ్ సెంటర్ గా అమరావతి

Satyam News

Leave a Comment