26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాపై ఏం జరుగుతుంది?

#ChintadaAnand

బాపట్ల జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం లోని పిట్టల వానిపాలెం మండలం లోని కొత్తపాలెం బిలీవర్స్ ఈస్టర్ చర్చ్ పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా సరికాదని, అదే గ్రామానికి చెందిన న్యాయవాది అక్కల రామిరెడ్డి న్యాయపోరాటం కి దిగారు.

వాటి వివరాలు ఇలా ఉన్నాయి. చింతాడ ఆనంద్ అనే ఫాస్టర్ అన్య మతస్తులను క్రైస్తవులుగా మత మార్పిడి చేస్తున్నారని, ఇతరుల స్థలాల్లో అక్రమంగా చర్చిల నిర్మాణం చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది అక్కల రామిరెడ్డి ప్రతిఘటించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చింతాడ ఆనంద్ చందోలు పోలీస్ స్టేషన్లో అక్కల శ్రీరామ్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు.

ఇదిలా ఉండగా పాస్టర్ చింతాడ ఆనంద్ మాట్లాడుతూ తాను పుట్టుక నుంచి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తినని, తాను మతవిశ్వాసాన్ని మార్చుకున్నంత మాత్రాన ఫేక్ డాక్యుమెంట్లు ఆధారంగా చూపించి నేను మతం మారానని , ఎస్సి హోదా రద్దు చేయాలని శ్రీరామిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించటం జరిగిందన్నారు.

శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ  చింతాడ ఆనంద్ గత 5 సంవత్సరాలుగా గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తూ, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నాడని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. చింతాడ ఆనంద్ కు  న్యాయ స్థానాల్లో ప్రతికూలంగా తీర్పు వెలువడటంతో, చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేయాలని  సుప్రీంకోర్టు కూడా తీర్పు వెలువరించింది. దీనిపై శ్రీయుత జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాజ్యాంగబద్ధంగా తీర్పు ఇవ్వాలని శ్రీరామ్ రెడ్డి కోరుతున్నాడు.

జిల్లా కలెక్టర్, కమిటీ సభ్యులు  నిర్ణయంపై ఇరువర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తీర్పు ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించబోతుంది.

Related posts

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

Satyam News

రోజా రివర్స్‌ గేర్‌.. ఎవరిది డైవర్షన్‌..? ఏది రాజకీయం..??

Satyam News

జూలై 16 నుంచి కులవృత్తుల మేళా

Satyam News

ఇరాన్ ప్రతీకారం: మండిపోతున్న గల్ఫ్ దేశాలు

Satyam News

తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలి

Satyam News

నెట్టెంపాడు భూ సేకరణ 45 రోజుల్లోగా పూర్తవ్వాలి

Satyam News

Leave a Comment