ముఖ్యంశాలుహోమ్

రిలయన్స్ వారసుడు.. ఆంధ్ర దత్త పుత్రుడు.. అనంత్ అంబానీ!

#AnanthAmbani

చంద్రబాబు నాయుడుగారు.. మీరు ఆదేశించండి.. నేను ఆచరిస్తాను అని.. సంచలన వ్యాఖ్యలు చేశారు రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు, ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్ అంబానీ. తనను ఆంధ్రా బిడ్డగా భావించి.. అందమైన రాష్ట్రం కోసం ఏం చేయాలో చెప్పండి అంటూ.. అనంత్ అంబానీ సీఎం చంద్రబాబును కోరడంతో.. వేదికపై ఉన్న నాయకులందరి మొహాల్లో నవ్వులు కనిపించాయి.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సంస్థకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొన్న రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై నమ్మకంతో ఈ చారిత్రాత్మకమైన ఘట్టంలో తమ సంస్థను భాగస్వాములను చేసిన.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ రోజు ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కి కేవలం శంకుస్థాన మాత్రమే చేయడం లేదని.. రైతుల జీవితాలను మెరుగు పరిచే బలమైన గ్రామీణ భారత నిర్మాణానికి పునాది వేస్తున్నామని అనంత్‌ అంబానీ వివరించారు. లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్న రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, సోలార్.. విండ్‌ పవర్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఏపీలో లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. విశాఖపట్నంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో డేటా సెంటర్‌ నిర్మాణం, వైజాగ్.. కర్నూలు ప్రాంతాల్లో ఆహార శుద్ది కేంద్రాలు, క్యాంపా కోలా బాట్లింగ్ ప్లాంట్లు, పంప్డ్‌ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్‌ వంటి అనేక రంగాల్లో రియలన్స్ ఏపీలో పెట్టుబడులు పెడుతోంది. మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్ ద్వారా.. పంటల సాగులో యంత్ర పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెంచి వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి తోడ్పడనున్నారు. మదనపల్లె సభలో అనంత్ అంబానీ ఓపెన్‌ ఆఫర్‌తో.. రాష్ట్రంలో రిలయన్స్ నుంచి మరిన్ని పెట్టుబడులు, విద్యా సంస్థలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related posts

సికా లో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ప్రవేశ శిక్షణ కార్యక్రమం

Satyam News

ఆస్తి కోసం సొంత నేతపై వైసీపీ లీడర్‌ గొడ్డలి వేటు…!!

Satyam News

పాత మంగళగిరి హిందూ శ్మశానవాటికకు సరికొత్త రూపు

Satyam News

కోర్టులో అంబటి వీడియో…. పొన్నవోలుకి జడ్జి షాక్‌…!!

Satyam News

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

Satyam News

Leave a Comment