రంగారెడ్డిహోమ్

తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో నిరంతర సంప్రదింపులు

#CMRevanth

తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని, ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర అధికారులకు అందజేయాలని స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహట్టి బ్యారేజీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చలు, బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

ముంపు భూములపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వే నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్ర అధికారులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఇరిగేషన్ ఈఎన్‌సీ (జనరల్) రమేష్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

అమెరికా టారిఫ్ జయశంకర్ సునిశిత వ్యాఖ్య

Satyam News

రైతులకే మా తొలి ప్రాధాన్యం: నాదెండ్ల మనోహర్

Satyam News

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

Satyam News

నువ్వు ముస్లిం అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా రహమాన్?

Satyam News

శ్రీరామ జన్మభూమి ఆలయం శిఖరంపై కాషాయ ధర్మ ధ్వజం

Satyam News

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News

Leave a Comment