ప్రత్యేకంహోమ్

బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌!

#Lokesh

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో లోకేష్‌ వరుసగా సమావేశమయ్యారు. ఏపీలో ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతివ్వాలని కోరారు. అదే సమయంలో రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక విధానాల గురించి ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించారు.

ఓప్స్ ర్యాంప్ CEO వర్మతో లోకేష్‌ సమావేశమయ్యారు. అమరావతిలో డిజైన్ & ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో డెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్‌తోనూ భేటీ అయ్యారు. ఏపీలో యూఎస్ పెట్టుబడులకు సహకారం అందించాలన్నారు.

శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో సమావేశమై.. ఏపీలో డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. జడ్ స్కాలర్ CEO జే చౌదరితోనూ మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్‌తో సమావేశమై..అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటుచేయాలని కోరారు. రిగెట్టి కంప్యూటింగ్ సీటీవో డేవిడ్ రివాస్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

Satyam News

టిటిడి డైరీలు, క్యాలెండర్లకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌

Satyam News

ఫేక్ వార్తలపై వైసీపీకి షాక్ ఇచ్చిన కోర్టు

Satyam News

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

Satyam News

ఎల్ నినో ప్రభావం తో ఈసారి కష్ట కాలమే

Satyam News

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

Satyam News

Leave a Comment