కరీంనగర్హోమ్

రామడుగులో శాశ్వత విద్యుత్ లైన్ వీధి దీపాల ఏర్పాటు

#Ramadugu

బతుకమ్మ పండుగ ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా రామడుగు గ్రామంలో ఎన్నడూ లేని విధంగా శాశ్వత విద్యుత్ లైన్, వీధి దీపాల లైన్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ మహమ్మద్ మొహీజ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, పాలకవర్గం వార్డు సభ్యులు, విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో ఈ పనులు చేపట్టారు.

తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి చొప్పదండి మార్గంలో మేడారం సత్తయ్య కట్టే మిషన్ నుంచి అయ్యోరుకుంట చెరువు వరకు సుమారు 20 విద్యుత్ స్తంభాలతో శాశ్వత విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు శాశ్వత వీధి దీపాల లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడనున్నాయి.

గతంలో ఈ ప్రాంతంలో ఇలాంటి శాశ్వత విద్యుత్, వీధి దీపాల సదుపాయం లేకపోవడంతో పండుగలు, ఇతర కార్యక్రమాల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యేవని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ లైన్, వీధి దీపాల లైన్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామ ప్రజలు, మహిళలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహమ్మద్ మొహీజ్, ఉప సర్పంచ్, పాలకవర్గం వార్డు సభ్యులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహమ్మద్ మొహీజ్, ఉప సర్పంచ్ పెందోట రాజు, పాలకవర్గం వార్డు సభ్యులు మామిడి దిలీప్ కుమార్, ఎండీ ఆరీఫ్, మామిడి శ్రవణ్, కారుపాకల నరేష్, చంద అనిల్, సిరిగిరి వెంకటేశం, నాయకులు సిరికొండ సాయి తేజ, నీలం లక్ష్మణ్, సామంతుల తిరుపతి, మేడారం అనిల్, రాగం రవి తదితరులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలి

Satyam News

తిరుపతిలో వెల్లివిరుస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ

Satyam News

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న సానా సతీష్

Satyam News

ధర్మేంద్ర కేవలం భర్త మాత్రమే కాదు….

Satyam News

బచ్చలికూర జోసఫ్ సన్నిహితురాలిని కలిసిన జగన్

Satyam News

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు

Satyam News

Leave a Comment