25.3 C
Hyderabad
September 29, 2026
హైదరాబాద్హోమ్

4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు  ప్రతిపాదనలు

#SanjaijajuIAS

భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు  ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నామని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ  భవ్య పథకంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్క్ ల పురోగతిపై బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్,  పరిశ్రమలు  వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చేనేత,  పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, సిక్తా పట్నాయక్  తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, భవ్య పథకంలో మొదటి దశలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే 4 ఇండస్ట్రియల్ పార్కులకు సంబందించిన పూర్తి ప్రాజెక్ట్  రిపోర్ట్ ను కేంద్రానికి ఈనెలాఖరులోగా అందచేస్తున్నామని తెలిపారు. ఒక్కో పార్కు 500 ఎకరాలకన్నా అధిక విస్తీర్ణంలో  ఉంటుందని, ఇందుకుగాను భూసేకరణ ఇతర ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని తెలిపారు.

వీటిలో కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీం పట్నం ఎలిమినేడు, ఘట్కేసర్ మండలం మాదారం, చౌటుప్పల్ మండలం దండు మైలారం ఉన్నాయన్నారు. వీటిలో ఎలక్ట్రానిక్, సాఫ్ట్ వేర్  తదితర  రంగాలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు. వీటితోపాటు,  మరో 16 ప్రాంతాల్లో ఇండస్టీయల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు.

Related posts

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెకు  మరమ్మతులు

Satyam News

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

Satyam News

క్షేత్ర స్థాయిలో బలం… పోరాడే గుణం… సువేందు

Satyam News

రెయిన్ బజార్ రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ నమోదు

Satyam News

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా!

Satyam News

షాబాద్‌లో ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

Satyam News

Leave a Comment