దేశవ్యాప్తంగా జరిగే జాతీయ జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలనే డిమాండ్ న్యాయ మైనదని, తమ పార్టీ తరఫున త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని రిపబ్లిక న్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) జాతీయ అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలే ఓబీసీ నేతలకు హామీ ఇచ్చారు.
నేడు ఢిల్లీలోని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే నివాసంలో, జనగణనలో ఓబీసీల కులాల వారీ జనాభా లెక్కలను సమగ్రంగా సేకరించేందుకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని , ప్రతి కులానికి ఒక యూనిట్ కోడ్ కేటాయించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోనీ ఓబిసి ప్రతినిదుల బృందం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే ని కలిసి వినతిపత్రం సమర్పించింది.
బీసీ లెక్కల్లో స్పష్టత తీసుకురావాలి
అనంతరం కేంద్రం మంత్రితో, జనగణన లో ఓబీసీ కులగణన అంశం పై సుమారు 15 నిమిషాల సేపు ఓపిసి నేతలు చర్చించారు, 2027 జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఓబీసీల కులాల వారీ జనాభా లెక్కల సేకరణకు స్పష్టమైన విధానం లేదని, ఎస్సీ ఎస్టీ కాలము వలె ఓబీసీ కాలమ్ కూడా చేర్చితేనె బీసీ కులాల లెక్కలు వెల్లడి అవుతాయని, కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయమైన డేటా సేకరించకపోతే ఓబీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రావాల్సిన వాటా దక్కకుండా పోతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రతి ఓబీసీ కులానికి ప్రత్యేక గుర్తింపు కోడ్ కేటాయించి, కచ్చితమైన జనాభా గణాంకాలను సేకరించాలని, తెలంగాణ, బీహార్ రాష్ట్రాలలో జరిగిన కులాల వారీ సర్వే అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తగిన జోక్యం చేసుకొని, ఓబీసీలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాందాస్ అథవలే మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం అన్ని వర్గాలకు సాధికారత రావాలంటే శాస్త్రీయమైన, సమగ్రమైన డేటా అవసరం అని భావించి కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో కులగనగా చేపడుతుందని ఆయన తెలిపారు కానీ దేశవ్యాప్తంగా ఓబీసీలు ప్రత్యేకమైన జాబితా రూపొందించి ఓబీసీ కాలం చేర్చాలని విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ తరఫున అలాగే, కేంద్ర మంత్రిగా తాను కూడా బీసీల ఆకాంక్షలను గౌరవించి అతి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాస్తానని కేంద్రమంత్రి రాందాస్ హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
