పశ్చిమగోదావరి హోమ్

అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించాలి

#Protest

రాష్ట్ర ప్రభుత్వం పేదలు, దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. సోమవారం నాడు ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేశాము.

ఈ సందర్బంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ మాట్లాడుతూ అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ పై ఉన్న నిషేధాన్ని త్వరలోనే తొలగించి రాష్ట్ర ప్రజలకి తీపి కబురు చెబుతామని నవంబర్ 10న జరిగిన మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. పేదలు బడుగు బలహీన వర్గాలు, దళితులకు ఉపయోగపడే అసైన్మెంట్ భూములను అభివృద్ధి పేరుతో బలవంతంగా భూసేకరణ చేస్తూ పేదల చేతుల్లో ఉన్న ఎకరా, అరకొరా భూములను లాగేసుకోవడం దుర్మార్గమన్నారు 

నేటి ప్రభుత్వాలకు ఆనవాయితిగా వస్తున్నవి దళితులు పేదలకు సంక్షేమ పథకాలు సాకు చూపి  సాగు చేసుకుంటున్నా భూములను సైతం భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నానికి పూనుకున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూముల విధానంలో భూ కబ్జాదారులకు తీపి కబురు, లక్షలాది మంది దళిత, బలహీనవర్గాలకు చేదు కబురుగా వుందని ఏద్దేవా చేశారు.

బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసిన మహానుభావుడు ఎస్ ఆర్ శంకరన్ పోరాడి 9/77 చట్టం తీసుకొస్తే నేటి కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని పేదలకు దూరం చేయాలని చట్టంలో ఉన్న విషయాల్ని సవరిస్తూ నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వాల నుండి లబ్ధి పొందిన దళిత, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను పలుకుబడి కలిగిన వారికి, గ్రామీణ సంపన్నులకు కట్టబెట్టడానికే ఈ ఫ్రీ హోల్డ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం చేసిందని విమర్శించారు.

ఐక్య ఉద్యమాలు చేయడానికి మేం సిద్ధం

2023లో ఆనాటి వైసిపి ప్రభుత్వం గడచిన 50 ఏళ్లలో అసైన్డ్ భూములు పొందిన పేదలు 20 ఏళ్ళు అనుభవించిన తర్వాత అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయచ్చని 9/77 చట్టాన్ని సవరించడానికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత సంఘాలు ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగా ప్రభుత్వానికి తగ్గాయని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయడానికి వ్యవసాయ కార్మిక సంఘం పూనుకుందన్నారు.

రానున్న కాలంలో ఎస్ అండ్ భూముల రక్షణకై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రజాసంఘాలను దళిత సంఘాలను కార్మిక ఉద్యోగ సంఘాలను మేధావులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సన్నద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టే విధంగా ప్రజలందరి ఐక్యం చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ విధానాలను పేదలకు నష్టం కలిగించే ఉన్నాయన్నారు.

మెట్ట ప్రాంతంలో దళితులు గిరిజనులు ఇతర కులాల్లో ఉన్న పేదలకు తీవ్రమైన అన్యాయం జరిగేలా అసైన్డ్ ఫ్రీ హోల్డ్ ఎత్తివేసే విధానాన్ని తీసుకురావాలని చూడడం దుర్మార్గమన్నారు.  వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు చెందిన భూములను గుర్తించడానికి కోనేరు రంగారావు భూ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.

కమిటీ సిఫార్సులను అమలు చేయని ప్రభుత్వం

కానీ ఆ కమిటీ ఇచ్చిన నివేదికను అప్పటి ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వాలు వరకు అమలు చేయడంలో వైఫల్యం చెందాయిని విమర్శించారు. ఆ నాడు వ్యవసాయ కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు పెద్ద ఎత్తున పోరాటం ద్వారా వచ్చిన ఈ చట్టాలను నేడు పాలకులు వారి ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేయడం జరుగుతుందన్నారు. 9/77 చట్టాన్ని సవరించిన సందర్భంలో కూడా వ్యవసాయ కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించి పెద్ద ఎత్తున పోరాటం చేశాయని గుర్తు చేశారు.

నాడు చంద్రబాబు నాయుడు మేము అధికారములోకి వచ్చిన వెంటనే అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములపై సమగ్రంగా విచారించి అక్రమంగా స్వాధీనం చేసుకున్న పెత్తందారుల నుండి భూములు వెనక్కు తీసుకొని తిరిగి పేదలకు ఇస్తామని హామీ నిలబెట్టుకోవాలని కోరారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2025 మార్చిలో మంత్రి వర్గ ఉప సంఘం నియమించి అదే విధంగా రెండుసార్లు గ్రామ రెవెన్యూ, సదస్సులు పెట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ప్రభుత్వం చేసిన నిర్ణయాలు నేటికీ ఆచరణలకు నోచుకోలేదని విమర్శించారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ఎకరం అనర్హుల చేతుల్లో ఉన్న భూమి తీసుకొని పేదలకు పంచాలేదని మండిపడ్డారు. ఒక్క అక్రమదారునిపైన కూడా చర్య తీసుకోలేదని తెలిపారు. అక్రమంగా అన్యాక్రాంతం చేసి దౌర్జన్యంగా పేదల భూములు అనుభవిస్తున్న వారి పైన నేటికీ ఒక కేసు లేదని గుర్తు చేశారు. కానీ పేదల భూముల కోసం పోరాడుతుంటే పోలీసులను ఉసిగొలిపి అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వాలు కొట్టినపిండి అన్నారు.

 ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షరాలు తామా ముత్యాలమ్మ, జిల్లా నాయకులు ఎం జీవరత్నం, ఎస్. మహంకాళి, జీ. వెంకట్రావు, జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వరరావు,  ఎస్ రాజశేఖర్, ఏ ప్రభాకర్, మాధవ్,హోలీ మేరీ, వర్మ, శ్రీనివాస్  భూములు కోల్పోయిన పేదలు బాలస్వామి, సుబ్బారావు, అర్జున్ రావు, కృష్ణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

డేటింగ్ యాప్ పరిచయం తో లైంగిక క్రియ నేరం కాదు

Satyam News

వైసిపి కోవర్టుల అరాచకాలకు చెక్

Satyam News

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

Leave a Comment

error: Content is protected !!