కృష్ణహోమ్

సరస్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని

#Pemmasani

కృష్ణానది తీరంలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్ మేళా ఏర్పాట్లను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పరిశీలించారు. సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.

గత ఏడాది గుంటూరులో నిర్వహించిన సరస్ మేళా విజయవంతమైందని, అదే స్ఫూర్తితో విజయవాడలో కృష్ణానది తీరాన సరస్ మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా మహిళలు ఈ మేళాలో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని తెలిపారు.

డ్వాక్రా, మెప్మా మహిళలు పెద్ద సంఖ్యలో సరస్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. మహిళలు స్వయంగా తయారు చేస్తున్న హస్తకళా వస్తువులు, సంప్రదాయ ఉత్పత్తులు, ఇతర గృహోపకరణాలకు సరస్ మేళా ఒక మంచి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, వాటికి జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటమే సరస్ మేళా ప్రధాన ఉద్దేశమని వివరించారు. మహిళలు కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులుగానే కాకుండా, విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ మేళా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళల నైపుణ్యానికి, సృజనాత్మకతకు గుర్తింపు తీసుకురావడంతో పాటు, వారి ఉత్పత్తులకు వినియోగదారులను చేరువ చేసేలా సరస్ మేళా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విఎంసి కమిషనర్ ధ్యాన్ చంద్, మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ కేంద్రం

Satyam News

పేదల తిరుపతి ఆలయ పునర్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

Satyam News

భార్య పిల్లల్ని చితక్కొట్టినా తప్పులేదు

Satyam News

CII సమ్మిట్ గ్రాండ్ సక్సెస్‌..బాబు, లోకేష్‌ సూపర్‌..

Satyam News

అర్హుడైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి

Satyam News

దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు

Satyam News

Leave a Comment