26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

పోలవరం ప్రాజెక్ట్ లో రెండో రోజు సి ఎస్ ఎం ఆర్ ఎస్ పరీక్షలు

#PolavaramProject

పోలవరం  ప్రాజెక్ట్ లో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ(సిఎస్ఎంఆర్ఎస్ ) బృందం గురు వారం రెండో పరీక్షలు నిర్వహించింది. బృందం సభ్యులు లలిత్ కుమార్ సోలంకి, హనుమాన్ ప్రసాద్ మీనా పోలవరం ప్రాజెక్ట్ లో రాతి కట్టడాలను, వాటి నిర్మాణానికి వినియోగిస్తున్న కాంక్రీట్ ను  పరిశీలించారు. వారి పర్యటన  . ప్రాజెక్ట్ లోని జి  హిల్ లో జరుగుతున్నా గ్రౌటింగ్ ను వారు తనిఖీ చేశారు.

అక్కడ వినియోగిస్తున్న కాంక్రీట్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసారు.  జలవనరుల శాఖ ఈఈ డి శ్రీనివాస్, , ఎం ఈ ఐ ఎల్ జిఎం గంగాధర్, డీజీఎం మురళి పమ్మి, నాణ్యతా విభాగం డీజీఎం శంకరయ్య  శాస్త్రవేత్తలకు వివరాలు అందించారు.    పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి  వాడిన కాంక్రీట్ ను బుధవారం నిర్మాణ ప్రాంతంలో పరిశీలించిన శాస్త్రవేత్తలు గురువారం  వాటి నాణ్యతను పరిశీలించారు.

డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వాడిన కాంక్రీట్ ను దిమ్మల రూపంలో సేకరించి భద్ర పరిచారు.  వాటిని అధిక పీడనంతో నీటిని ప్రయోగించి యెంత శాతం నీటిని పీల్చుకుంటుంది అని తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ఈ దిమ్మలకు ప్లాస్టిక్ కవర్ తొడిగి పరీక్షలు నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ కు  ఇరువైపులా ప్లాస్టిక్ షీట్స్ అమర్చి ఆ తరువాత కాంక్రీట్ వేశారు. ఇక్కడ కూడా అలానే పరీక్షలు నిర్వహించారు.

ఆ పరీక్షల్లో కాంక్రీట్ నాణ్యమైనదిగా తేలింది. ఆడ్ కో  ల్యాబ్ లో  కూడా వారు నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. ఈ ల్యాబ్ ను జలవనరుల శాఖ నాణ్యతా తనిఖీల నిమిత్తం ఏర్పాటు  చేసింది.

Related posts

ట్రంప్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ

Satyam News

మహా జన సముద్రం గా మారిన మేడారం

Satyam News

వచ్చే నెలలో పెళ్లి… నేడు ప్రమాదం లో మృతి

Satyam News

లోకేష్‌ ను ఫాలో అవుతున్న జగన్‌, కేటీఆర్‌..

Satyam News

పాత్రికేయులు కొండేపూడి మృతి

Satyam News

హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వాన

Satyam News

Leave a Comment