ప్రత్యేకంహోమ్

ఇవన్నీ నాఇళ్లే…. నీ దారి చూసుకో….. షర్మిలకి జగన్‌ అల్టిమేటమ్‌!

#YelahankaPalace

వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా షర్మిల కుమార్తె అంజిలి వివాహ వేదిక ఎంపిక వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని యలహంక నివాసంలోనే పెళ్లి జరపాలని షర్మిల భావిస్తుండగా, అందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ షర్మిలకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

అది నా ఇల్లు.. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కుదరదంటూ జగన్ ఆ లేఖలో స్పష్టం చేశారు. వందలాది మంది బయటి వ్యక్తులు, క్యాటరింగ్ సిబ్బంది, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ బృందాలు తన నివాసంలోకి రావడం భద్రతాపరంగా ముప్పు అని, ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టవద్దని జగన్‌ తేల్చిచెప్పారు.

తన ఆందోళనలను, భద్రతా కారణాలను వివిధ వ్యక్తుల ద్వారా పదే పదే చెప్పినప్పటికీ షర్మిల పట్టించుకోకపోవడంపై లేఖలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జగన్. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ఆస్తిని ఉపయోగించుకోవాలని లేదా వేరే వెడ్డింగ్ వేదికను వెతుక్కోవాలని ఆయన స్పష్టం చేశారు. నా నివాసంలో మాత్రం పెళ్లి జరిగే ప్రసక్తే లేదు, మీ దారి మీరు చూసుకోండనే రీతిలో గట్టిగా వార్నింగ్ ఇస్తూ లేఖ రాశారు.

సొంత చెల్లి అయినా సరే, వ్యక్తిగత భద్రత , గోప్యతా విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని జగన్‌ లేఖ ద్వారా షర్మిలను హెచ్చరించారు. ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న ఈ తాజా వివాహం, వేదికల గొడవకు సంబంధించి జగన్ రాసిన ఈ లేఖ రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Related posts

ఆరబెట్టి, గ్రేడింగ్ చేసిన ఉల్లికి రూ.12 గ్యారెంటీ

Satyam News

జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

విశాఖలో మరో పోర్టు.. కొత్త స్టీల్‌ప్లాంట్‌ లోడింగ్‌..!!

Satyam News

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు

Satyam News

మోడీ పై ‘వార్’ మొదలు పెట్టిన డోనాల్డ్ ట్రంప్

Satyam News

Leave a Comment