సినిమాహోమ్

గల్ఫ్ పై మిట్టపల్లి బతుకమ్మ పాట నేడు దుబాయ్ లో ఆవిష్కరణ

#GulfSong

ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో అంటూ సాగే బతుకమ్మ పాటని  అక్షర గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువలరీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కోట కుమార్ (కె కె)  నిర్మించగా ఈ గీతానికి ప్రముఖ తెలంగాణ ప్రజా కవి గాయకుడు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించారు గుండెను తట్టిలేపుతున్న ఈ గేయాన్ని మంగ్లీ ఆలపించగ నేపధ్య సంగీతం మదీన్ ఎస్కే సమకూర్చారు.

దుబాయ్ లో వలస కార్మికుల అన్న చెల్లెళ్ళ గోస ప్రతిబింబించేలా ఉన్న ఈ పాట సొంత ఊరిలో పండుగ జరుపుకోవాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ గల్ఫ్ లో బతుకుపోరు రీత్యా అయినవాళ్ళమధ్య సొంత ఊరిలో పండగ జరుపుకోలేని తెలంగాణ ఆడ బిడ్డలకు అన్నదమ్ములకు ఈ గీతం మధుర స్మృతులను మిగిల్చేలా ఉంది ఈ పాటలో సాహిత్యం  దూదు సేమియాకు సత్తు బెల్లానికి కలిపిన బంధం  కర్జూర తీపికి బతుకమ్మ బాణీకి అద్దిన మాధుర్యం రెండు మతాలమధ్య రెండు విభిన్న సంప్రదాయాల మధ్య ఉన్న సామరస్యాన్ని  అనుబంధాన్ని  దుబాయి వేదికగా గల్ఫ్ నుండి గళమెత్తి ప్రపంచానికి హిందూ ముస్లిం భాయి భాయి అని సరికొత్తగా బతుకమ్మ పాట రూపంలో వినిపించింది

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఐన ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా దుబాయ్ బతుకమ్మ పాటని  గొలుగొండ కోటనుండి బురుజుఖలిఫా దాకా  ఏడు దేశాలను ఏడు రంగుల లెక్క అద్ది బురుజు ఖలీఫా అంత ఎత్తైన బతుకమ్మ పాటను పేర్చి మిట్టపల్లి స్టూడియో ద్వారా ఇటు తెలంగాణ అటు గల్ఫ్ లో ఉన్న ఆడబిడ్డలకు ఈ పాటను అంకితమిచ్చారు అక్షర గ్రూప్స్ చైర్మన్ కోట కుమార్.

ఈ కార్యక్రమంలో భారతదేశం తెలంగాణ నుండి సంప్రదాయ వాయిధ్యాలైన డప్పు బృందాలు ఒగ్గుడోలు బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దుబాయితో పాటు అబుదబి నుండి పెద్దసంఖ్యలో కార్మికులు వారికుటుంబాలు పాల్గొని బతుకమ్మ పండుగని విజయవంతంచేసిన ఈ కార్యక్రమాన్ని స్పార్క్ మీడియా మరియు సుతారి సత్యం మల్లేష్ గౌడ్ లు నిర్వహించారు.

Related posts

21న యాక్షన్ కింగ్ అర్జున్ ఐశ్వర్య రాజేష్’ల “మఫ్టీ పోలీస్”

Satyam News

ఉరిశిక్ష అమలు విధానాలను మార్చడం కుదరదు

Satyam News

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

Satyam News

ప్రత్యేక ఓటరు సవరణ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam News

యుద్ధంలో ముగ్గురు భారతీయ సీఫేరర్ల మృతి

Satyam News

ఫారెక్స్ నిల్వల్లో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన భారత్

Satyam News

Leave a Comment