విశాఖపట్నంహోమ్

విశాఖలో 60 లక్షల దొంగ నోట్లు – ఓటర్లకు పంచడానికేనా?

#FakeCurrency

విశాఖ మహారాణిపేట పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరవ్యాప్తంగా పోలీసులు లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన బృందం స్థావరంపై దాడి చేసి, వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను, డమ్మీ తుపాకీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు సభ్యులు గల బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి, నగరంలో ఈ నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకురావడానికి పథకం రచించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. గతంలో నెల్లూరులో నకిలీ మద్యం, కొన్ని చోట్ల వైకాపా నాయకులు ఇలా నకిలీ నోట్లను పంచిన వార్తలు వచ్చాయి. కొన్ని కేసు తాలూకూ సాక్ష్యాలు మంత్రి అవ్వగానే నెల్లూరు కోర్టులో తనవే చోరీకి గురవ్వడం, దాని మీద కథలు గత వైకాపా హయాంలో మీడియాలో మనం చదివాం.

ఎలాగూ విశాఖలో ఏకంగా జగన్ తన తల్లి విజయమ్మను నిలబెట్టినా కూడా కొరుకుడు పడని ప్రాంతం అయినందున ఇలా నకిలీ నోట్లతో కాలనీలలోని ఓటర్లను బురిడీ కొట్టించి, పరువు నిలుపుకుందాం అనే కుట్రలకు తెరతీశారా అనే చర్చలు బీచ్ దగ్గర సిమెంట్ బెంచీల మీద పెద్దోళ్ల మధ్య చర్చ జరుగుతోంది. ఏ ప్రొఫెషనల్ దొంగనోట్ల ముఠా అయినా ఎన్నికల వేళ ఇలా లాడ్జీల్లో పెద్ద ఎత్తున 60 లక్షల నోట్ల దొంగ నోట్లతో దొరుకుతారా అనే అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో వెంకటేశ్వరుని ప్రసాద నెయ్యినే కల్తీ చేసిన అనుభవం, ఆ డబ్బులతో మన దగ్గరే అపార్టుమెంట్లలో ప్లాట్లు కొన్నారు మరి అనే జోకులు కూడా వేస్తున్నారు. అప్పట్లో తెల్ల సీమ పంచాలతో హంగామా.. ఇప్పుడు ఈ చిల్లర నకిలీ నోట్లు అనే చర్చ మాత్రం సముద్రం ఒడ్డున షికార్లు చేస్తున్నాయి.

విశాఖలో నకిలీ నోట్ల చలామణిని అరికట్టేందుకు, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక బృందాలతో తనిఖీలు మరింత తీవ్రతరం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద లావాదేవీలపై సమాచారం ఉంటే ప్రజలు తక్షణమే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

Related posts

భారీ ఎత్తున పెరగనున్న మెడికల్ కాలేజీ సీట్లు

Satyam News

వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి కన్నుమూత

Satyam News

తప్పుడు ప్రచారం కేసులో జగన్ సి పి ఆర్ ఓ అరెస్టు

Satyam News

బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam News

గత పాలకుల తప్పిదాలతో….టిడ్కో నివాసితులకు కష్టాలు….

Satyam News

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌ 2026 పోస్టర్ ఆవిష్కరణ

Satyam News

Leave a Comment