ముఖ్యంశాలుహోమ్

పులివెందుల గడ్డపై పచ్చ జెండా.. సోదిలో కూడా లేని వైసీపీ

#Jagan

దశాబ్దాల నుంచి వైఎస్ కుటుంబానికి కుంచుకోట.. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సొంతగడ్డ.. పులివెందుల మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగిరింది. పులివెందుల పుర పోరులో వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ సీటుతో పాటు మెజారిటీ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం నలభై వార్డుల్లో.. 20 చోట్ల వైసీపీ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో.. అక్కడ కూటమి పార్టీల అభ్యర్ధులు ఏకగ్రీవంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. పోలింగ్‌ జరిగిన 20 వార్డుల్లోనూ వైసీపీ కేవలం మూడు వార్డుల్లో మాత్రమే గెలిచింది.

టీడీపీ అభ్యర్ధి తూగుట్ల గీతాకుమారి మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన వైఎస్ ప్రమీలమ్మపై.. 13 వేల 875 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి గీతాకుమారి ఘన విజయం సాధించారు. ఒకప్పుడు పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురు నిలిచి పోటీ చేయాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి భయానక వాతావరణం నుంచి పులివెందుల ప్రజలకు విముక్తి లభించింది. ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చొక్క మడత పెట్టాను.. రాండి చూసుకొందాం అని సవాల్‌ చేసిన జగన్‌.. పోలింగ్‌ రోజున.. హెలికాప్టర్ ఆపేశారు, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకొన్నారంటూ ఫేక్‌ ఆరోపణలతో నిరసన డ్రామాలు చేసి.. ఓటు కూడా వేయకుండా బెంగళూరు వెళ్లిపోయారు. పులివెందులలో పార్టీ ఓటమి ఖాయమని జగన్‌కి ముందే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓడిపోయే సీటు కోసం ప్రచారం చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకని.. వైసీపీ అధినేత మొదటి నుంచి పులివెందుల మున్సిపల్ ఎలక్షన్స్‌కి దూరంగా ఉంటూ వచ్చారు.

పోలింగ్‌ సమయంలో అలజడి సృష్టించి.. రీపోలింగ్‌ కోసం కోర్టులో పిటిషన్‌లు వేసినా.. కౌంటింగ్‌ నిలిపివేయడానికి హైకోర్టు అంగీకరించలేదు. రిజల్ట్ ఎలా ఉంటుందో ముందే స్పష్టత ఉండటంతో.. కౌంటింగ్‌ రోజు కూడా జగన్‌ రాష్ట్రానికి రాకుండా బెంగళూరులోనే ఉండిపోయారు. పులివెందుల మున్సిపల్ కార్పొరేషన్‌ ఎలక్షన్స్‌లో తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయంతో.. ఒకప్పటి వైఎస్ కంచుకోటలో కొత్త చరిత్ర మొదలైంది.

Related posts

రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ (RRR) కాన్సెప్ట్ అర్థం చేసుకోండి

Satyam News

శ్రీనివాసమంగాపురంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు

Satyam News

ప్రధాని మోడీని టార్గెట్ చేసిన జగన్

Satyam News

హైడ్రాపై కేటీఆర్ కామెంట్ హాస్యాస్పదం: తుమ్మల

Satyam News

భారత్‌ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక

Satyam News

డీలిమిటేషన్ అర్ధం లేని చర్య

Satyam News

Leave a Comment