ప్రత్యేకంహోమ్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

#Modi

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావం… ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని సీఎం చెప్పారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా

వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని… ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తుఫాన్ సహయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నిరంతర అప్రమత్తతతో తుఫాన్ వల్ల వచ్చిన ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారంటూ సీఎం చంద్రబాబును ప్రధాని ప్రశంసించారు.

Related posts

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News

హీట్ వేవ్ యాక్ష‌న్ ప్లాన్‌: అన్ని ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు

Satyam News

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే పెను ప్రమాదం

Satyam News

అర్జున అవార్డు గ్రహీత, ధనుష్ శ్రీకాంత్‌కు స్పోర్ట్స్ సన్మానం

Satyam News

ఏరువాక పున్నమి సందర్భంగా తుమ్మల శుభాకాంక్షలు

Satyam News

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన

Satyam News

Leave a Comment