ప్రత్యేకంహోమ్

టీవీ యాంకర్ ను కాల్చి చంపిన భర్త

#RabiaAhasan

పాకిస్తాన్ లోని రావల్పిండిలో దారుణం జరిగింది. ఒక టీవీ యాంకర్ ను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపాడు. స్థానిక ప్రైవేటు టెలివిజన్ ఛానల్‌లో యాంకర్‌గా, వివిధ కార్యక్రమాల వ్యాఖ్యాతగా పనిచేస్తున్న రబియా అహ్సన్ ఆదివారం రావల్పిండిలోని గుల్షన్‌బాద్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నగర పోలీసు అధికారి హసన్ ముష్తాక్ సుఖేరా మాట్లాడుతూ రబియా అహ్సన్ భర్తను అదుపులోకి తీసుకున్నామని, అనుమానాస్పద తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఘటనాస్థలాన్ని ఆయనతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్), సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇన్వెస్టిగేషన్స్) పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా ఆధారాలు సేకరించింది.

పనివాడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, కాల్పుల ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని రబియా భర్త చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ వాదనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు ప్రక్రియ చేపట్టి, హత్యకు దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తీసుకువస్తామని పోలీసు అధికారి తెలిపారు.

పాకిస్థాన్ ప్రథమ మహిళ ఆసిఫా భుట్టో జర్దారీ ఈ హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టు హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులెవరైనా చట్టం ముందు నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

మరో మహిళా యాంకర్ హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోందని ఆసిఫా పేర్కొన్నారు. గత ఆగస్టులో రావల్పిండిలోని తన నివాసంలో 45 ఏళ్ల డిజిటల్ మీడియా సంస్థ ప్రతినిధి హీనా జావేద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటనను ఆమె గుర్తుచేశారు. హీనా జావేద్ మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఆ కేసు దర్యాప్తు ఫలితాలు ఇప్పటికీ వెల్లడికాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

వరుసగా మహిళలు తమ నివాసాల్లోనే హత్యలకు గురవుతున్న ఘటనలు పాకిస్థాన్‌లో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే రబియా అహ్సన్ హత్య వెనుక అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక అనంతరమే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Related posts

ఫేక్ న్యూస్ కు ఘాటు సమాధానం ఇవ్వండి

Satyam News

ప్రపంచ కప్ మూడో సారి భారత్ కైవసం

Satyam News

కల్తీ ఆహార పదార్ధాలను పట్టుకున్న పోలీసులు

Satyam News

తప్పుడు ప్రచారం కేసులో జగన్ సి పి ఆర్ ఓ అరెస్టు

Satyam News

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

Satyam News

రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత గొడ్డలి పార్టీకి ఎక్కడిది..?

Satyam News

Leave a Comment