రంగారెడ్డిహోమ్

కల్తీ ఆహార పదార్ధాలను పట్టుకున్న పోలీసులు

#FoodAdultration

 

హైదరాబాద్‌లో కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. శుక్రవారం చార్మినార్ పరిధిలోని న్యూ లాడ్‌బజార్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్-ఫాస్ట్ బృందం, ఆహార భద్రత శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించింది.

తనిఖీల సందర్భంగా సుమారు 110 కిలోల మేర సిద్ధంగా ఉంచిన వేయించిన చికెన్, పలుమార్లు ఉపయోగించిన వంట నూనె, నిషేధిత ఆహార రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోదాం ఎలాంటి ఆహార భద్రత అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

అధికారుల పరిశీలనలో గోదాంలో అత్యంత అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు బయటపడింది. ఆహార పదార్థాల నిల్వ, తయారీ ప్రక్రియలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారిపై హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌లో ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇలాంటి కల్తీ, నాణ్యతలేని ఆహార పదార్థాల వినియోగం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆహార వ్యాపారులు తప్పనిసరిగా చట్టబద్ధ అనుమతులు పొందడంతో పాటు పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని సూచించారు.

Related posts

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ‘ఏరువాక పౌర్ణమి వేడుకలు

Satyam News

మహాలక్ష్మీకి రెండు సంవత్సరాలు పూర్తి

Satyam News

దుబాయ్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

Satyam News

పాలు లేవు.. నెయ్యి లేదు… అంతా కల్తీ…

Satyam News

లైంగిక వేధింపుల కేసులో జేఎన్‌యూ ప్రొఫెసర్ డిస్మిస్

Satyam News

టీటీడీ కాలేజీల ఆన్ లైన్ అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

Leave a Comment