ముఖ్యంశాలుహోమ్

వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహంలో ‘మందు’కు రూ 120 కోట్లు!

#YSAnilreddy

చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది. దేశ విదేశాల నుంచి రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు భారీగా తరలివచ్చారు. అయితే, ఈ పెళ్లిలో ఏర్పాటు చేసిన రాయల్ హ్యాట్రిక్ హాస్పిటాలిటీ, విలాసవంతమైన ఏర్పాట్లు ఇప్పుడు వ్యాపార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేవలం అతిథులకు వడ్డించిన మద్యం (Liquor) కోసమే ఏకంగా రూ. 120 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

గ్లోబల్ లిక్కర్ సామ్రాజ్యం.. అనిల్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్

వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ కుమార్ రెడ్డికి కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా భారీ లిక్కర్ నెట్‌వర్క్ ఉంది. ఆఫ్రికన్ దేశాల్లోని అనేక ప్రాంతాలలో ఆయన భారీ ఎత్తున లిక్కర్ తయారీ, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ప్రధాన దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా ఆయనకు విస్తృతమైన మద్యం వ్యాపారాలు ఉన్నాయి. మద్యం పరిశ్రమపై ఉన్న పూర్తి పట్టు, ప్రపంచవ్యాప్త సంబంధాల కారణంతోనే ఈ స్థాయిలో అరుదైన బ్రాండ్లను పెళ్లికి తెప్పించగలిగినట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్లు.. రాయల్ లైనప్!

ఈ వివాహ వేడుకకు విచ్చేసిన విఐపి (VIP), వివిఐపి (VVIP) అతిథులకు వడ్డించడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన లిక్కర్ బ్రాండ్లను అందుబాటులో ఉంచారు. వీటిని The Whisky Exchange, లండన్‌లోని ప్రముఖ Harrods (Knightsbridge) మరియు Louis XIII Boutique at Harrods ద్వారా ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ వేడుకలో వైన్ మరియు షాంపైన్, విస్కీ, బ్రాందీ  కొన్ని అరుదైన మద్యం బ్రాండ్లు వడ్డించారు.

1762 Gautier Cognac: ప్రపంచంలోనే అత్యంత అరుదైన, పాతకాలపు కాగ్నాక్ బ్రాండ్లలో ఇది ఒకటి. వేలంలో దీని ధర రూ. కోట్లలో ఉంటుంది.

Croizet 1858 Cuvée Léonie: చారిత్రక నేపథ్యం ఉన్న అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ కాగ్నాక్.

Louis XIII Cognac (Grand Champagne): లగ్జరీ లిక్కర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ప్రీమియం బ్రాండ్ బాటిళ్లను ప్రత్యేకంగా అతిథుల కోసం తెప్పించారు.

Rare Single Malt Whiskies: ప్రపంచంలో కొన్ని బాటిళ్లు మాత్రమే లభ్యమయ్యే పలు వింటేజ్ సింగిల్ మాల్ట్ విస్కీలు కూడా అందుబాటులో ఉంచారు.

Dom Pérignon Rose Gold (1996) 6-Liter Methusela పింక్-గోల్డ్ కేసింగ్‌తో వచ్చే 6 లీటర్ల లిమిటెడ్ ఎడిషన్ రాయల్ షాంపైన్.

Romanée-Conti Grand Cru 1945 wine

Screaming Eagle Cabernet Sauvignon 1992 wine

ఈ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, బడా రియల్ ఎస్టేట్ ప్రముఖులు మరియు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికీ రాయల్ ట్రీట్‌మెంట్ అందించడంతో పాటు, రాయల్ లిక్కర్ వడ్డన ఈ వివాహాన్ని దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిపింది.

Related posts

డెమోగ్రఫీ మిషన్ ప్రారంభిస్తున్నాం…

Satyam News

పాషాణాలను సైతం కరిగించిన కథ!

Satyam News

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Satyam News

మాచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Satyam News

వేడుకగా లక్ష్మీ నరసింహ పుష్పయాగం

Satyam News

తిరుమలపై కుట్రలు ఆపవా జగన్…..?

Satyam News

Leave a Comment