హైదరాబాద్హోమ్

బేతుపల్లి చెరువు సహాయక బృందాలకు సీఎం రేవంత్ అభినందన

#Revanthreddy

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో గల్లంతైన మత్స్యకారులు, వారిని రక్షించేందుకు వెళ్లి చిక్కుకుపోయిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, అధికారులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.

భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులతో పాటు, వారిని కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కూడా సురక్షితంగా బయటపడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ఇతర సహాయక సిబ్బంది, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి అభినందనీయమని సీఎం పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సహాయక బృందాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని అన్నారు. సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

పుణ్య ఫలితాలు ఇచ్చే పుష్యమాసం

Satyam News

పోలీసుల సూచనను ఖాతరు చేయని నేహా బోరా

Satyam News

జాతీయ మీడియాలో లోకేష్‌పై సంచలన కథనాలు

Satyam News

ఫైబర్ నెట్ విస్తృత పరిచేందుకు పటిష్ట ప్రణాళిక

Satyam News

పాత్రికేయులు కొండేపూడి మృతి

Satyam News

పెండింగ్ పనుల పూర్తికి ప్రాధాన్యత

Satyam News

Leave a Comment