చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు, రామడుగు మండలంలో PACS | IKP ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కోల రమేష్, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్, ముఖ్య అతిథులుగా పాల్గొని కేంద్రాలను ప్రారంభించారు. వెదిర, పందికుంట పల్లి, ఆవుదేరుపల్లి, దేశ రాజు పల్లె, వెలిచాల గ్రామాలలో ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, తూకంలో పారదర్శకత పాటిస్తూ, సకాలంలో వడ్లను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు నమ్మకంతో కేంద్రాలకు వడ్లను తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మర వేణి తిరుపతిసర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దావా అనంతరెడ్డి, దేవమ్మ లచ్చయ్య లత విరమల్లు,వీర్ల నర్సింగరావు, ఉప్పని అంజనిప్రసాద్, బాల గౌడ్, కాడ శంకర్,ఉప సర్పంచ్ లో ఫోరం అధ్యక్షులు మనీష్, కృష్ణ,రాజిరెడ్డి, వినోద్, హైదర్,నాయకులు, రవి, శ్రీనివాస్, లేఖ రాజు, సంతోష్ రెడ్డి, హనుమంతు, నర్సింగ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరుశురాం,మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, రాజు,బిట్టు, మధు,మారుతి, అంజయ్య, బాబు, కనకయ్య, జగన్, వర్ధన్, మల్లేశం, మునీందర్, శీను, నరేష్, కనకయ్య, మహేష్, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు భారీగా పాల్గొన్నారు.
