ప్రత్యేకంహోమ్

వైఎస్ గుట్టు బయటపెట్టిన వైసీపీ ప్రధాన కార్యదర్శి

#YSJagan

జగన్‌ చెప్పిన ఒక్క అబద్దంతో.. మరుగున పడిపోయిన ఎన్నో నిజాలు బయటకొస్తున్నాయి. వైఎస్ కుటుంబం రక్త చరిత్ర ఎంత దారుణమైనదో ప్రస్తుతం జగన్‌ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లే వివరిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి.. అందరూ అనుకొన్నంత మంచివాడేమీ కాదంటున్నారు ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న సతీశ్‌రెడ్డి. అతనికి వ్యతిరేకంగా ఉండే వాళ్లను చంపించాలనే తాపత్రయం ఎక్కువని షాకింగ్‌ సంగతులు చెప్పారు. ఇందుకు ఉదాహరణగా వైఎస్సార్‌తో తన ప్రత్యక్ష అనుభవాన్ని వివరించారు.

1989లో సతీశ్‌రెడ్డి తన మేనమామతో పాటు కాంగ్రెస్‌ పార్టీలో చేరానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కొన్నాళ్లు రాజశేఖరరెడ్డితో సన్నిహితంగా ఉన్నారట. ప్రస్తుత కాంగ్రెస్ నేత.. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్‌. తులసి రెడ్డి.. వైఎస్ కుటుంబాన్ని గట్టిగా టార్గెట్‌ చేశారని సతీశ్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

రాజకీయంగా తనకు ఇబ్బందికరంగా మారుతున్న తులసిరెడ్డిని చంపేయమని తనతో చెప్పారనే సంగతి బయటపెట్టి పెద్ద బాంబు పేల్చారు సతీశ్‌రెడ్డి. అప్పట్లో సతీశ్‌రెడ్డి వయసు కేవలం 20 సంవత్సరాలే. చిన్న కుర్రాడిని కూడా తన హత్యా రాజకీయాల కోసం వాడుకోవాలని చూసిన రాక్షస మనస్తత్వం గురించి అందరూ తెలుసుకోవాలని అంటున్నారు.

రాజకీయ ప్రత్యర్ధి ఎదుగుతుంటే.. వాళ్లను అడ్డు తొలగించడం వైఎస్ రాజశేఖరరెడ్డి విధామని వివరించారు సతీశ్‌రెడ్డి. రాజశేఖరరెడ్డికి లోపల ఒక అపరిచితుడు, బయట ఇంకో అపరిచితుడు ఉన్నాడని.. ప్రత్యర్ధులు ఎదిగితే ఆధిపత్యం నిలబెట్టుకోలేమనే భయంతో.. అపోజిషన్‌ లీడర్లను అడ్డు తొలగించుకొంటూ వచ్చారని.. అప్పట్లో జరిగిన భయానక, భీభత్స హత్య రాజకీయాల గురించి ఈ తరానికి తెలియజేశారు.

తనను హత్య చేయడానికి వైఎస్ ఫ్యామిలీ ఎటెంప్ట్‌ చేసిందని తులసిరెడ్డి స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు. ఫ్యాక్షనిజంతో ఎలాంటి సంబంధం లేని తులసిరెడ్డి లాంటి వారిని చంపాలని ప్రయత్నించారంటే.. వైఎస్ ఫ్యామిలీ ఏ రేంజ్‌లో ప్రత్యర్ధులను వెంటాడి వేటాడారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తులు ఈరోజు మంచితనానికి మారు పేరు అని చెప్పుకోవడం వింతల్లోనే పెద్ద వింత.

Related posts

ఈ స్వరాభిషేకం సినిమా కథ కాదు

Satyam News

చమురు ఎగుమతులతో ఇరాన్ కు భారీ ఆదాయం

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

Satyam News

సూర్యాపేటకు చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం

Satyam News

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

Satyam News

శాంతి భద్రతలే పెట్టుబడులకు పునాది

Satyam News

Leave a Comment