సంపాదకీయంహోమ్

ఏపీలో దూకుడు… పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఒత్తిడి!

#CBN

ఏపీకి భారీ ప్రాజెక్టులు క్యూ కడుతుండడంతో  పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఒడిశా ఆందోళనకు గురవుతున్నాయి. ఏపీకి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వం ఒక్కరోజే రూ. 5.84 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఆకర్షించడంపై పక్క రాష్ట్రాల మంత్రులు, ఆర్థిక విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ దూకుడును చూసి ఆందోళన చెందుతున్నారు.

AP సాధించిన MOUలపై తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి TRB రాజా స్వయంగా ఎక్స్ వేదికగా స్పందించారు.

ఏపీ ఒక్కరోజే రూ. 5.35 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలను  కుదుర్చుకుందని, ఇందులో చాలా ఒప్పందాలు తమిళనాడు పోటీపడి దక్కించుకోవాల్సినవేనన్నారు. తమిళనాడులోని విజయ్ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. అంతేకాకుండా, ఇటీవల ఓ భారీ సంస్థ తమిళనాడును కాదని ఏపీ వైపు చూస్తోందన్న వార్తలు కూడా వచ్చాయన్నారు.

ఒడిశాకు చెందిన  ఒడిశా గ్రోత్ హబ్ వంటి వేదికలు కూడా AP పెట్టుబడుల వేగంపై ప్రశంసలు కురిపించాయి. ఏపీతో ఒడిశాను పోల్చుతూ విశ్లేషణలు చేస్తున్నాయి. విశాఖ సదస్సు ద్వారా ఏపీ రూ. 5.84 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 1.07 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా అడుగులు వేస్తూ, బలమైన సందేశం పంపుతోందని పేర్కొన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, కియా, గ్రీన్‌కో, రెన్యూ ఎనర్జీ, గెయిల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో పొరుగు రాష్ట్రాలు పోటీ ఇవ్వలేకపోతున్నాయి.

రాష్ట్రంలో డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, క్వాంటం వ్యాలీ, స్పేస్ సిటీ, డ్రోన్ హబ్, డిఫెన్స్ క్లస్టర్ వంటి భవిష్యత్ తరహా ప్రాజెక్టులు వస్తుంటే వైసీపీ నేతలు విమర్శలు, వెటకారాలు చేస్తున్నారని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. కేవలం అప్పులు చేసి బటన్ నొక్కడం అభివృద్ధి అనుకునే వారికి ఈ భారీ పారిశ్రామిక పెట్టుబడుల విలువ తెలియదని, ఏపీ ప్రగతిని చూసి పొరుగు రాష్ట్రాలే ఆందోళన చెందుతుంటే..ఇక్కడున్న వారికి మాత్రం అదేమి కనిపించట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Related posts

కొత్త రోడ్డుకు అప్పుడే గతుకులు….

Satyam News

ఏపీ సర్కార్‌పై సంచలన సర్వే… చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ షాక్‌

Satyam News

సోనియా సెహ్రావత్ ఎవరు? ఇది చదవండి…

Satyam News

World Record: అత్యంత ఎత్తులో ఐఎల్-76 విమానం ల్యాండింగ్

Satyam News

సేవా తత్వాన్ని సహించలేనిది ప్రత్యర్థి పార్టీ నాయకులా?

Satyam News

వార్ రూమ్ నుంచి మరువలేని సాయం

Satyam News

Leave a Comment