రంగారెడ్డిహోమ్

సేవా తత్వాన్ని సహించలేనిది ప్రత్యర్థి పార్టీ నాయకులా?

కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన అంబలి,చలివేంద్రం కేంద్రానికి అధిక మొత్తంలో ప్రజా ఆదరణ రావడంతోసేవాభావాన్ని కూడా రాజకీయ రణరంగంగా మార్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆర్యవైశ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంబలి, చలివేంద్ర కేంద్రంలో ఏర్పాటుచేసిన దాత చిత్రపటాన్ని తొలగించాలని ఓ అధికారి అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఉద్యోగితో ఒత్తిడి చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆర్యవైశ్యులు కార్యాలయ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.మానవత్వం మరిచి సేవా తత్వాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయ రణరంగ మారుస్తున్నారని ఈ విషయాన్ని విన్న పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు వివిధ రూపేనా ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నులతో ఇచ్చే పథకాలకే వారి సొంత సొమ్ము ఖర్చుపెట్టినట్టుగా వారి చిత్రపటాలను పెట్టుకుంటున్నారని, సొంతంగా జేబులోనుండి ఖర్చులు భరిస్తూ సేవా కార్యక్రమం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో సత్యసాయి సేవా మందిరం వారు సత్యసాయి చిత్రపటాన్ని పెట్టి చలివేంద్రంలో త్రాగు నీటిని మాత్రమే అందించేవారు.

అప్పట్లో ఆయన చిత్రపటాన్ని పెట్టి సేవ చేసేవారు. అధికారులు గతంలో ఎప్పుడు ఈ విధంగా వ్యవహరించలేదని, ప్రస్తుత అధికారుల వ్యవహార శైలిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తు సేవా తత్వాన్ని రాజకీయ రణరంగంగా మార్చకూడదని, వివిధ పార్టీ నాయకులను ఆర్యవైశ్యులు వేడుకుంటున్నారు.

Related posts

దేశ తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య జయంతి నేడు

Satyam News

పెన్షన్ బెనిఫిట్స్ కోసం లంచం: ఇద్దరి పట్టివేత

Satyam News

సొంత కూటమి దేశాలపై ట్రంప్ దారుణ వ్యాఖ్యలు

Satyam News

బాక్సైట్ తవ్వకాలపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం

Satyam News

మరో కన్నడ చిత్రంలో నటిస్తున్న డాక్టర్ పిసి ఆదిత్య

Satyam News

దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కీలక నిర్ణయం

Satyam News

Leave a Comment