విజయనగరంహోమ్

వర్ధంతి రోజు ఉత్సవమా?: గురజాడ సాంస్కృతిక సమాఖ్య పై విమర్శ

#Gurajada

“దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్” అంటూ స్వాతంత్ర్యానికి ముందే జాతిని మేల్కొలిపారు ఏపీలోని విజయనగరంకు చెందిన మహాకవి గురజాడ అప్పారావు. ఆయన పేరుతో ఏర్పడిన గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఈ నెల 30న “గురజాడ సాహితీ చైతన్యోత్సవం” నిర్వహించనుంది. అయితే ఆ రోజు గురజాడ వర్ధంతి కావడంతో, ఆ రోజున ఉత్సవం పేరుతో వేడుకలు జరపడం ఏమిటని సాహితీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు.

గురజాడ జయంతి అయిన సెప్టెంబర్ 21ని ప్రభుత్వం పండుగగా గుర్తించి అధికారిక కార్యక్రమాలు నిర్వహించింది. వర్ధంతి స్మరణ దినం. అలాంటి రోజున “చైతన్యోత్సవం” పేరుతో పురస్కారాలు, సత్కారాలు ఏర్పాటు చేయడం సముచితం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే వేదికపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు “గురజాడ విశిష్ట పురస్కారం” ప్రదానం చేయనున్నట్లు సమాఖ్య ప్రకటించింది. రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆహ్వాన పత్రికలో ముద్రించారు.

రిజిస్ట్రేషన్ సంగతేంటి?

ఆహ్వాన పత్రికపై సమాఖ్య రిజిస్ట్రేషన్ నంబర్ ఎక్కడా లేదు. సంస్థ ఏర్పడి దాదాపు రెండు దశాబ్దాలు గడిచాయి. ఇప్పటివరకు సమాఖ్య పేరుతో 23 మందిని సత్కరించారు. అయినా సంస్థ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నమోదైందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. మంత్రి స్థాయి అతిథులను ఆహ్వానిస్తున్న సంస్థ తన నమోదు వివరాలను బహిరంగంగా తెలపాలని పలువురు కోరుతున్నారు.

సమాఖ్య వివరణ

ఈ విషయమై సమాఖ్య సభ్యురాలు సూర్యలక్ష్మిని సంప్రదించగా, మహాకవి గురజాడను స్మరించుకుంటూ కార్యక్రమం తలపెట్టామని చెప్పారు. పురస్కార గ్రహీతలతో పాటు ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ గుర్తిస్తున్నామన్నారు. గురజాడ సాహిత్యాన్ని, వారసత్వాన్ని భావి తరాలకు అందించడమే సమాఖ్య లక్ష్యమని తెలిపారు. అయితే వర్ధంతి రోజున ఉత్సవం నిర్వహించడంపై గానీ, రిజిస్ట్రేషన్ వివరాలపై గానీ ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

Related posts

అంపశయ్యపై నుంచి అభివృద్ధి పథంలోకి…

Satyam News

“తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లు పూర్తి

Satyam News

అవసరం లో ఉన్న వైసీపీ కార్యకర్త ను ఆదుకున్న మంత్రి లోకేష్

Satyam News

తిరుమల నుంచి అన్యమతస్తులు ఔట్‌…!

Satyam News

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఒమన్ మధ్య కీలక ఒప్పందం

Satyam News

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు

Satyam News

Leave a Comment