ఆధ్యాత్మికంహోమ్

డిసెంబర్ 6 నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

#PadmavatiTemple

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నవాహ్నిక విధానంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిసెంబర్ 1న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాలు జరుగుతాయి.

వాహన సేవల షెడ్యూల్

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు.

తేదీ  | ఉదయం  | రాత్రి

6| ధ్వజారోహణం| చిన్నశేష వాహనం

7| పెద్దశేష వాహనం| హంస వాహనం

8| ముత్యపుపందిరి వాహనం| సింహ వాహనం

9| కల్పవృక్ష వాహనం| హనుమంత వాహనం

10| పల్లకీ ఉత్సవం| గజ వాహనం

11| సర్వభూపాల వాహనం| స్వర్ణరథం, గరుడ వాహనం

12| సూర్యప్రభ వాహనం| చంద్రప్రభ వాహనం

13| రథోత్సవం| అశ్వ వాహనం

14| పంచమీ తీర్థం| ధ్వజావరోహణం

15న పుష్పయాగం నిర్వహించనున్నారు.

బంగారు పద్మం నుంచి అమ్మవారి ఆవిర్భావం

తిరుచానూరు ఆలయ స్థలపురాణం ప్రకారం, శ్రీ పద్మావతి అమ్మవారు పద్మసరోవర పుష్కరిణిలోని బంగారు పద్మం నుంచి ఆవిర్భవించినట్లు ప్రతీతి. అందుకే ఈ ప్రాంతానికి తొలుత పద్మావతిపురం అనే పేరు ఏర్పడిందని, కాలక్రమంలో అది తిరుచానూరుగా మారిందని చెబుతారు. అమ్మవారి ఆలయం వెనుక భాగంలో పద్మసరోవర పుష్కరిణి ఉంది.

కార్తీక మాస శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో అమ్మవారు బంగారు పద్మం నుంచి ఆవిర్భవించారని పురాణ ప్రతీతి. ఈ పవిత్ర దినానికి తొమ్మిది రోజుల ముందు నుంచే శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పంచమీ తీర్థానికి ప్రత్యేక ప్రాధాన్యం

బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 14న పద్మసరోవరంలో పంచమీ తీర్థం సందర్భంగా చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సప్త సముద్రాలు, ముక్కోటి తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, చక్రస్నానంలో పాల్గొంటారు.

ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ పలు సేవలను రద్దు చేసింది.

డిసెంబర్ 1: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, బ్రేక్ దర్శనాలు రద్దు.

5 నుంచి 16 వరకు: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనాలు రద్దు.

భక్తులు ఈ మార్పులను గమనించి, టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.

Related posts

జగన్‌కి అందని ఢిల్లీ పల్స్‌…. మోదీ దూకుడుతో మైండ్‌ బ్లాంక్‌….!!

Satyam News

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

Satyam News

చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం

Satyam News

షూటింగ్ లో గాయపడ్డ నందమూరి బాలకృష్ణ

Satyam News

ముంబైలో ఘోరం: గాల్లో ఆగిపోయిన మోనోరైళ్లు

Satyam News

ఆక్రమిత కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాద శిబరాలు?

Satyam News

Leave a Comment