ప్రకాశంహోమ్

సూర్యలంక తీరం లో మరో రెండు రోజుల పాటు నిషేధం

బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాపట్ల డిఎస్పి రామాంజనేయులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా బాపట్ల జిల్లా బాపట్ల సూర్యలంక,పాండురంగపురం సముద్ర తీరానికి వచ్చే భక్తులు పర్యటకులకు మరో రెండు రోజులపాటు అనుమతి లేదని తెలియజేయడానికి చింతిస్తున్నామని అన్నారు. మంథా తుఫాన్ ప్రభావం వలన తీరంలో కెరటాలు ఎగసి పడినందున గుంటలు ఏర్పడ్డాయని ఫిషరీస్, గజేతగాళ్ల ద్వారా తీరం పరిశీలించడం జరిగిందని తద్వారా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్ణయం తీసుకుని సూర్యలంక తీరం తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినందున మరో రెండు రోజులపాటు తీరానికి రాకపోకలు నిషేధించబడినదని తెలిపారు.

ఈ సందర్భంగా గుంటూరు,పల్నాడు, విజయవాడ, హైదరాబాదు దూర ప్రాంతాల నుండి వచ్చే వారు మరల అధికారులు ఆదేశాలు జారీ చేసే వరకు సహకరించాలని కోరారు. ఈ సమావేశం లో రూరల్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సై శ్రీనివాస్ రావు ఉన్నారు.

Related posts

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

Satyam News

122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్‌’ గర్భ గుడి

Satyam News

ప్రేమ.. దొంగ పెళ్లి… చివరకు విషాదం..

Satyam News

చౌడేశ్వరి హత్య కేసులో సీఐ సస్పెన్షన్

Satyam News

రాజధాని రైతులపై దాడులు చేస్తే తగిన బుద్ధి చెబుతాం

Satyam News

ప్రాణాలు కాపాడిన 2టౌన్ పోలీసులు

Satyam News

Leave a Comment