26.3 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

ముఖ్యమంత్రికి సన్మానం చేసిన వనపర్తి ఎమ్మెల్యే

తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డికి సన్మానం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపనలు చేశారు.

రూ.15 కోట్ల వ్యయంతో ఆత్మకూరు నగర అభివృద్ధి పనులకు, రూ.15 కోట్ల వ్యయంతో అమరచింత నగర అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటరు భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పి. జె.పి క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె. అరవింద్ ప్రసాద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కు పూల బోకె ఇచ్చి స్వాగతం పలికగా

అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రులు వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, దేవరకద్ర శాసన సభ్యుడు జి. మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, వనపర్తి జిల్లా ఎస్పీ డి. సునీతరెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శశిధర్, ఇతర నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

Satyam News

మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం

Satyam News

గొడవలు అల్లర్లు చేస్తే, ర్యాలీ చేస్తే రిమాండ్

Satyam News

టీడీపీ నేత మక్కెన కుమారుడి వివాహ వేడుకకు హాజరైన లోకేష్

Satyam News

రైతు భరోసా నిధుల విడుదల కు ముహూర్తం ఖరారు

Satyam News

దుబాయ్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

Satyam News

Leave a Comment