విజయనగరం పూసపాటి రాజవంశీయులు ఉదారతకు పెట్టింది పేరు. మాన్సాస్ ట్రస్టు ద్వారా.. విజయనగరంలో అనేక విద్యా సంస్థలను నడిపిస్తున్నారు. వీటికి తోడుగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి.. మాన్సాస్ ట్రస్టుకి చెందిన 136 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. మొదట భోగాపురం ఎయిర్‌పోర్టు సమీపంలో.. ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. కానీ విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు.. మాన్సాస్ ట్రస్టు భూముల్లోనే ఏవియేషన్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రతిపాదించారు. సీఎం చంద్రబాబు.. ఇందుకు ఆమోదముద్ర వేశారు.
ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చు. ఉచితంగా ల్యాండ్ ఇవ్వడానికి పూసపాటి కుటుంబం పెట్టిన షరతు ఒక్కటే. ఏవియేషన్ ఎడ్యూసిటీకి మాన్సాస్ పేరు పెట్టాలని కోరారు. పూసపాటి వంశం నుంచి అలక్ నారాయణ ఏవియేషన్ రంగంలోకి వెళ్లి పైలెట్‌గా పని చేశారు. ఆయన పేరుతోనే మాన్సాస్ విద్యా సంస్థలు ఏర్పాటు చేశామని.. ఇప్పుడు ఆయన గుర్తుగానే ఏవియేషన్ సిటీకి భూములు ఇస్తున్నామని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు.
విమానయాన రంగానికి చెందిన అన్ని విభాగాల యూనివర్శిటీలను ఎడ్యూ సిటీకి తీసుకురావాలని మంత్రి లోకేశ్ లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ ఇండస్ట్రీ టెక్నీషియన్స్‌లో 25 శాతం మంది తెలుగు వారే ఉండాలనేది ఆయన టార్గెట్. ఏడాదిలోనే ఎడ్యూ సిటీ నిర్మాణం పూర్తి చేసి.. ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. పైలెట్ల దగ్గర నుంచి విమానాల మెయింటెనెన్స్, రిపేరింగ్, ఓవర్ హాలింగ్ వంటి అన్ని రంగాలకు చెందిన యూనివర్శిటీలు ఎడ్యు సిటీకి రాబోతున్నాయి. అయితే, 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన తర్వాత విజయనగరంలో పార్టీ పట్టు పెంచుకోవడానికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుని జగన్ వేధించాడు.. తరతరాలుగా వస్తోన్న మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుండి ఆయనని తప్పించే ప్రయత్నం చేశారు.. రాజుగారిని జగన్ ముప్పుతిప్పలు పెట్టాడు.. ఆయన బంధువులని తెరమీదకి తీసుకువచ్చి అశోక్ గజపతిని ఇబ్బంది పెట్టాడు జగన్..
నేడు అదే అశోక్ గజపతి రాజుని ఒప్పించి, మాన్సాస్ ట్రస్ట్ భూములను ఏవియేషన్ యూనివర్శిటీకి వందల ఎకరాలను కట్టబెట్టేలా చేశారు మంత్రి లోకేష్.. ఆ భూములని యూనివర్శిటీకి ఇచ్చినందుకు మాన్సాస్ ట్రస్ట్ పేరుని కూడా యూనివర్శిటీ పేరులో వచ్చేలా చూసుకున్నాడు లోకేష్.. హుందా, హోదా కలిగిన వ్యక్తులను గౌరవిస్తే లభించే ప్రతిఫలాలు ఎలా ఉంటోయో లోకేష్ మరోసారి ప్రూవ్ చేశారు. జగన్ విధ్వంసం సృష్టిస్తే, లోకేష్ అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాడు.. నాడు – నేడు ఎంత తేడా..!!
